
మెగా హీరో వరుణ్ తేజ్ లవ్‌లో ఉన్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అతడు ప్రేమిస్తుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠినేనని అభిమానులందరికీ తెలుసు! కానీ వరుణ్ మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. అయితే లావణ్య మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరో పేరును ప్రస్తావిస్తూ పరోక్షంగా హింట్స్ వదిలింది. కానీ ఆమె కంటే ముందు రెండేళ్ల క్రితమే వీరి లవ్ మ్యాటర్‌ను నిర్మాత అల్లు అరవింద్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
చావు కబురు చల్లగా సినిమా ఈవెంట్‌లో లావణ్య అందరికీ హాయ్ చెప్తుండగా అల్లు అరవింద్ ఎంతో చనువుగా ఆమె చేతిలో నుంచి మైక్ తీసుకున్నాడు. 'ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తోంది. ఈ అమ్మాయి ఇక్కడే ఓ కుర్రాడిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిలైపోతే బాగుంటుంది కదా' అని కామెంట్ చేశాడు. దీంతో లావణ్య సిగ్గుపడుతూ నవ్వేసింది. ఈ వీడియో చూసిన జనాలు.. 'మీరు ముందే చెప్పారు, కానీ మేమే పసిగట్టలేకపోయాం' అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా చావు కబురు చల్లగా సినిమా 2021 మార్చిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. ఇకపోతే వరుణ్- లావణ్యల నిశ్చితార్థం శుక్రవారం(జూన్ 9న) ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు, మెగా ఫ్యామిలీ సభ్యులు హాజరయ్యారు. త్వరలో పెళ్లి చేసుకోనున్న ఈ కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Congratulations @Itslavanya and @IAmVarunTej ❤️ #VarunLav#varunlavanyaengagement https://t.co/9NyZMvTYrQ pic.twitter.com/X3tU5FG62f
— జన నేత్ర (@jananetra) June 9, 2023
Comments
Please login to add a commentAdd a comment