అల్లు అర్జున్‌ బర్త్‌డే సీడీపీ: పోలా.. అదిరిపోలా.. | Allu Arjun Birthday CDP Launched By 46 Actors, Directors | Sakshi

అల్లు అర్జున్‌ బర్త్‌డే సీడీపీ: అప్పుడే ట్రెండింగ్‌లోకి..

Apr 6 2021 6:36 PM | Updated on Apr 6 2021 6:57 PM

Allu Arjun Birthday CDP Launched By 46 Actors, Directors - Sakshi

సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా టాలెంట్‌ లేకపోతే ఎవరూ రాణించలేరు. వారు చేసే సినిమాలు ప్రేక్షకుడికి నచ్చితేనే హీరోగా స్వీకరిస్తారు. అలా తొలి సినిమా గంగోత్రితోనే మ్యాజిక్‌ చేశాడు హీరో అల్లు అర్జున్‌. తర్వాత చేసిన ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు చిత్రాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టాడు. ఫ్లాప్‌ అన్న పదానికి చాలా దూరంగా ఉండే ఈ హీరో ఈ మధ్య అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. ప్రస్తుతం. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యం చుట్టూ అల్లుకున్న 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు. 

అభిమాని తలెత్తుకునేలా సినిమాలు చేసే ఈ హీరో ఏప్రిల్‌ 8న బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు బన్నీ కామన్‌ డీపీని రిలీజ్‌ చేశారు. ఇందులో బన్నీ సినిమా లుక్స్‌ అదిరిపోగా ఓ సందేశాన్ని కూడా ప్రజలకు చేరవేశారు. "సర్వ శిక్షా అభియాన్‌.. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి" అన్నదే అల్లు అర్జున్‌ అభిమతమని చెప్పకనే చెప్పారు. 'గో గ్రీన్‌ విత్‌ అల్లు అర్జున్‌' అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఇక ఈ సీడీపీని సుమారు 46 మంది నటీనటులు రిలీజ్‌ చేయడం విశేషం. 


 

ప్రగ్యా జైస్వాల్‌, కృతీ శెట్టి, ప్రణీత, అంజలి, శ్రీముఖి, సురభి, శ్రద్దా దాస్‌, హెబ్బా పటేల్‌, అవికా గోర్‌, రాజ్‌ తరుణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, రానా దగ్గుబాటి, నిఖిల్‌, వైష్ణవ్‌తేజ్‌, మంచు విష్ణు సహా పలువరు నటీనటులతో పాటు పలువురు డైరెక్టర్లు, సినీ సెలబ్రిటీలు ఈ సీడీపీ లాంచ్‌లో పాల్గొన్నారు. బన్నీ బర్త్‌డేను పురస్కరించుకుని పుష్ప టీమ్‌ ఫ్యాన్స్‌ కోసం స్పెషల్‌ ట్రీట్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. రేపు సాయంత్రం 4 గంటలకు పుష్పరాజ్‌ను పరిచయం చేయనున్నారు.

చదవండి: లాస్య గ్రాండ్‌ పార్టీ: రచ్చ లేపిన బిగ్‌బాస్‌ కంటస్టెంట్లు

మాల్దీవుల్లో టాలీవుడ్‌ ప్రముఖుల రచ్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement