cdp
-
రిలయన్స్ జియో అరుదైన ఘనత
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా కార్యకలాపాలు నిర్వహించే సంస్థల జాబితాలో జియోకు అత్యుత్తమ ’ఎ–’ లీడర్షిప్ రేటింగ్ దక్కింది. లాభాపేక్ష రహిత సంస్థ సీడీపీ, 2021 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఈ జాబితాలో, భారత్ నుంచి లీడర్షిప్ ర్యాంకింగ్ దక్కించుకున్న ఏకైక టెలికం/డిజిటల్ సంస్థ రిలయన్స్ జియోనే. మరో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ’సి’ రేటింగ్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ గల 272 కంపెనీలను ఈ జాబితా కోసం మరింపు చేసినట్లు సీడీపీ తెలిపింది. వాతావరణ మార్పులు, అడవులు.. నీటి సంరక్షణ వంటి అంశాల్లో ఆయా కంపెనీల పనితీరు, వాటి పారదర్శకత స్థాయి ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చినట్లు పేర్కొంది. గతేడాది ’బి’ రేటింగ్ నుంచి జియో ఈ ఏడాది మరో అంచె ఎదిగింది. భారతి ఎయిర్టెల్ రేటింగ్ 2020లో ’డి–’ నుంచి ఈసారి ’సి’ స్థాయికి మెరుగుపడింది. చదవండి: ట్రాయ్‌కు రిలయన్స్ జియో ఫిర్యాదు! ఎందుకంటే.. -
అల్లు అర్జున్ బర్త్‌డే సీడీపీ: పోలా.. అదిరిపోలా..
సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే ఎవరూ రాణించలేరు. వారు చేసే సినిమాలు ప్రేక్షకుడికి నచ్చితేనే హీరోగా స్వీకరిస్తారు. అలా తొలి సినిమా గంగోత్రితోనే మ్యాజిక్ చేశాడు హీరో అల్లు అర్జున్. తర్వాత చేసిన ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు చిత్రాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టాడు. ఫ్లాప్ అన్న పదానికి చాలా దూరంగా ఉండే ఈ హీరో ఈ మధ్య అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం చుట్టూ అల్లుకున్న 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు. అభిమాని తలెత్తుకునేలా సినిమాలు చేసే ఈ హీరో ఏప్రిల్ 8న బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు బన్నీ కామన్ డీపీని రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ సినిమా లుక్స్ అదిరిపోగా ఓ సందేశాన్ని కూడా ప్రజలకు చేరవేశారు. "సర్వ శిక్షా అభియాన్.. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి" అన్నదే అల్లు అర్జున్ అభిమతమని చెప్పకనే చెప్పారు. 'గో గ్రీన్ విత్ అల్లు అర్జున్' అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఇక ఈ సీడీపీని సుమారు 46 మంది నటీనటులు రిలీజ్ చేయడం విశేషం. Dearest @alluarjun, Wishing you a very happy birthday in advance 🎂 May all the joy you have spread around come back to you a hundredfold. Here's the CDP to celebrate your birthday 🥳 #AlluArjunBirthdayCDP pic.twitter.com/R0OMK3yYPl — Tamannaah Bhatia (@tamannaahspeaks) April 6, 2021 So happy to unveil the birthday CDP of stylish star and my Bunny ; hoping this year brings you many more milestones. @alluarjun #AlluArjunBirthdayCDP pic.twitter.com/wgwKz2UOe1 — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 6, 2021 ప్రగ్యా జైస్వాల్, కృతీ శెట్టి, ప్రణీత, అంజలి, శ్రీముఖి, సురభి, శ్రద్దా దాస్, హెబ్బా పటేల్, అవికా గోర్, రాజ్ తరుణ్, సాయిధరమ్ తేజ్, రానా దగ్గుబాటి, నిఖిల్, వైష్ణవ్‌తేజ్, మంచు విష్ణు సహా పలువరు నటీనటులతో పాటు పలువురు డైరెక్టర్లు, సినీ సెలబ్రిటీలు ఈ సీడీపీ లాంచ్‌లో పాల్గొన్నారు. బన్నీ బర్త్‌డేను పురస్కరించుకుని పుష్ప టీమ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. రేపు సాయంత్రం 4 గంటలకు పుష్పరాజ్‌ను పరిచయం చేయనున్నారు. చదవండి: లాస్య గ్రాండ్ పార్టీ: రచ్చ లేపిన బిగ్‌బాస్ కంటస్టెంట్లు మాల్దీవుల్లో టాలీవుడ్ ప్రముఖుల రచ్చ -
మా నిధులు..మా ఇష్టం
రెండేళ్లలో ప్రభుత్వం ఇచ్చింది రూ.36 కోట్లు ఎమ్మెల్యేలు వెచ్చించింది రూ.11.87 కోట్లే.. ఎమ్మెల్సీల ఖర్చూ అంతంతమాత్రమే.. శేఖర్‌రెడ్డి, పద్మావతి, సునీత, ప్రభాకర్‌రెడ్డి, కిశోర్ కొంత మెరుగు మిగిలిన వారిది నామమాత్రపు ఖర్చే.. ఆ నిధులనే పట్టించుకోని జానా, ఉత్తమ్ మంత్రి జగదీశ్‌రెడ్డి ఖర్చు పెట్టిందీ తక్కువే.. ఎమ్మెల్సీల్లో పూల రవీందర్ కొంత మెరుగే.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎమ్మెల్యే కోటాలో రూ.75 లక్షలు, మంత్రి కోటాలో మరో రూ.75లక్షలు.. ఇలా ఏటా రూ. కోటిన్నర.. ఈ నిధులన్నీ మన ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేసుకునేందుకు ఉద్దేశించినవి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే ప్రాజెక్ట్‌లు, సంక్షేమ కార్యక్రమాలతో సంబం ధం లేకుండా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి, ఇష్టమైన పనుల కోసం వీటిని ఖర్చు చేయొచ్చు. ఎమ్మెల్యే గారు ఫలానా పని కోసం అని ప్రతిపాదన పంపితే చాలు నిధుల మం జూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇయ్యొచ్చు. ఇది ఆయా ఎమ్మెల్యేల ఇష్టం. కానీ ‘మా నిధులు.. మా ఇష్టం’ అనుకున్నారో ఏమో.. మన జిల్లా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ) వెచ్చించడంలో మాత్రం వెనుకబడ్డారు. మూడో వంతు కూడా ఖర్చు చేయలేదు... రెండు ఆర్థిక సంవత్సరాలకు (2014-15, 2015-16) సంబంధించి జిల్లాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కలిపి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో మూడో వంతు ఖర్చు చేయలేదు. రెండేళ్లలో ఎమ్మెల్యేల నిధుల కింద (ఈ ఏడాది మార్చి 30 నాటికి) ప్రభుత్వం మొత్తం రూ.36 కోట్లు మంజూరు చేసింది. ఇందులో జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు ఖర్చు చేసింది కేవలం రూ.11.87 కోట్లే. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఒక్కరే రెండేళ్లలో కలిపి 60 శాతం నిధులు ఖర్చు చేశారు. ఏడాదికి రూ.కోటిన్నర చొప్పున రెండేళ్లకు ఆయన కోటాలో రూ.3 కోట్లు మంజూరు కాగా, రూ.1.83 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక.. ఆ తర్వాతి స్థానాల్లో మునుగోడు ఎమ్మెల్యే కె.ప్రభాకర్‌రెడ్డి రూ.1.53 కోట్లు (మొత్తం నిధుల్లో సగం), ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి రూ.1.45 కోట్లు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రూ.1.31 కోట్లు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ రూ.1.23 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఐదుగురు కలిపి రూ.7 కోట్లకు పైగా ఖర్చు చేయగా, మిగిలిన ఏడుగురు ఖర్చు చేసింది రూ. 5 కోట్ల పైచిలుకే. ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అయితే అసలు నియోజకవర్గ అభివృద్ధి నిధులనే పట్టించుకోలేదని అర్థమవుతోంది. జానారెడ్డి రెండేళ్లలో కలిపి ఖర్చు పెట్టింది కేవలం రూ.49.72 లక్షలే. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండేళ్లలో కలిపి అందరికన్నా తక్కువగా రూ.44.66 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా నియోజకవర్గ నిధుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయనకు రెండేళ్లలో రూ.3 కోట్లు మంజూరు కాగా, ఖర్చు పెట్టింది రూ.89.09 లక్షలే . ఎమ్మెల్సీలూ అంతే...! ఎమ్మెల్సీలకు ఏటా వచ్చే రూ.1.5 కోట్లకు గాను కనీసం సగం కూడా ఖర్చు పెట్టలేకపోయారు. 2015-16 సంవత్సరానికి జిల్లాలోని నలుగురు ఎమ్మెల్సీల (పూల రవీందర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, నేతి విద్యాసాగర్)కు కలిపి రూ.6 కోట్లు రావాల్సి ఉండగా, రూ.3.75 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఖర్చు పెట్టింది కేవలం రూ.58లక్షలే. 2014-15లో ముగ్గురు ఎమ్మెల్సీలుండగా (పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేరు), మొత్తం రూ.4.50 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద మంజూరయ్యాయి. ఇందులో రూ.3.26 కోట్లు ఖర్చు పెట్టారు మన ఎమ్మెల్సీలు. కొత్త ఎమ్మెల్యేలే నయం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మం దిలో నలుగురు ఒకటి కన్నా ఎక్కువ సార్లు గెలిచిన వాళ్లు కాగా, ఎనిమిది మంది కొత్త ఎమ్మెల్యేలే. నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు పెట్టడంలో మాత్రం సీనియర్ల కన్నా కొత్తగా గెల్చిన ఎమ్మెల్యేలే ముందంజలో ఉన్నారు. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసిన టాప్ నలుగురూ కొత్త ఎమ్మెల్యేలే కావడం విశేషం. అయితే.. ఒకటి కన్నా ఎక్కువ సార్లు గెలిచిన నలుగురు ఎమ్మెలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి, రవీంద్రకుమార్లో ఏ ఒక్కరు కూడా రెండేళ్లలో రూ.కోటికి మించి ఖర్చు చేయలేదు. కొత్తగా గెలిచిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం రూ.42.72లక్షలు, మిర్యాలగూడ ఎమ్మెల్య భాస్కర్‌రావు రూ.58.64లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి పనుల నుంచి ఖర్చు చేసింది రూ.89.17లక్షలే. ఇక సీపీఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్రకుమార్ (దేవరకొండ) కూడా సీడీపీ నిధుల వినియోగంలో వెనుకబడే ఉన్నారు. ఆయన రెండేళ్లలో కలిపి ఖర్చు చేసింది కేవలం రూ.75.14 లక్షలే కావడం గమనార్హం. -
ఆ రెండింటిపై ప్రేమెందుకో..
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట ప్రభుత్వం జిల్లాలో పలు నియోజకవర్గాలపై సవతి ప్రేమ కురిపిస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు నియోజకవర్గాలకే అభివృద్ధి నిధులు(సీడీపీ)మంజూరు చేసింది. శ్రీకాకుళం, నరసన్నపేటలకు మాత్రమే రూ. 2 కోట్లు వంతున విడుదల చేశారు. మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలను విస్మరించారు. ఈ కేటాయింపుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రెండు చోట్లా వైఎస్సార్సీపీ బలంగా వేళ్లూనుకుని ఉండడంతో ప్రభుత్వం దృష్ఠి సారించిందని భోగట్టా. త్వరలో శ్రీకాకుళం నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఈ పట్టణంలో ఇప్పుడు నిధులు గుమ్మరించి ప్రజలు మెప్పు పొందాలన్నదే ప్రభుత్వం యోచనగా తెలుస్తుంది. నరసన్నపేటలో గడచిన రెండు ఏళ్లుగా ఒక కొత్త పనికీ నిధులు విడుదల చేయలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేసి తమ ప్రగతిగా టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో నరసన్నపేటలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. రాజధానిని తాకిన అసంతృప్తిని బుజ్జగించేందుకు ఇక్కడ నిధులు విడుదల చేసినట్లు సమాచారం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకూ శాసన సభా నియోజకవర్గం అభివృద్ధి నిధులను విడుదల చేయలేదు. అన్ని నియోజక వర్గాల్లోనూ పనులు నిలిచిపోయాయి. ఆర్ధిక మాంద్యం, రాష్ట్ర విభజన సాకుగా రెండేళ్లుగా నిధుల మంజూరు నిలిపివేసింది. జిల్లాలో పది శాసన సభా నియోజకవర్గాలున్నాయి. ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. దీంతో ఈ రెండేళ్లలో జిల్లాలో రూ. 25 కోట్ల మేర అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మరో నెలరోజుల్లో ఈ ఆర్ధిక సంవత్సరం ముగియనుంది. -
ప్రత్యేక నిధికి చెక్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రత్యేక అభివృద్ధి పనులకు సర్కారు చెక్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరిట మంజూరైన పనులను నిలిపివేయాలని ప్రణాళిక విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తమకున్న పరపతితో తమ సొంత నియోజకవర్గాలకు ఈ నిధులు మంజూరు చేయించుకున్నారు. స్వయానా ముఖ్యమంత్రి సిఫారసుతో స్పెషల్ కోటాలో వీటిని తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో తమ అనుచరులు, అనుయాయులు, పార్టీ కార్యకర్తలకు ఎర వేసేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ఈ నిధిని ప్రయోగించారు. ఎమ్మెల్యేలకు ఏటేటా కోటి రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ)కి అదనంగా ఈ నిధులు విడుదలయ్యాయి. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో విడుదలైన ఎస్డీసీ నిధులపై పోస్ట్‌మార్టం ప్రారంభించింది. సొంత రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఈ పనుల గుర్తింపు.. నిధుల కేటాయింపు జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో వీటిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. గడిచిన మూడేళ్లలో ఎస్డీసీ కింద మంజూరైన పనుల్లో ఎన్ని పూర్తయ్యాయి..? ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయి..? ఇప్పటికీ ప్రారంభం కాని పనులెన్ని..? అనే వివరాలను ఆరా తీసింది. ఇప్పటివరకు ప్రారంభం కాని పనులు, అసంపూర్తిగా ఉన్నవాటిని యథాతథంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మన జిల్లాలో దాదాపు రూ.15 కోట్ల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గడిచిన మూడేళ్లలో జిల్లాకు రూ.31.32 కోట్లు స్పెషల్ కోటాలో విడుదలయ్యాయి. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 860 పనులు చేపట్టారు. వీటిలో ఇప్పటివరకు సగానికి సగం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నామినేటేడ్ పద్ధతిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే వీటిని దక్కించుకోవటంతో పనుల పురోగతి పక్కదారి పట్టింది. తమ పార్టీ అధికారంలో ఉండటంతో అప్పటి మంత్రి శ్రీధర్‌బాబు, అప్పటి ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి తమ నియోజకవర్గాలకు స్పెషల్ ఫండ్ మంజూరు చేయించుకునేందుకు పోటీ పడ్డారు. నామినేటేడ్ పద్ధతిపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ పనులు పంచి పెట్టారు. పార్టీ శ్రేణులకు లాభసాటిగా ఉంటుందని లింక్ రోడ్లు, సిమెంటు రోడ్లు, కాంపౌండ్ వాల్లకు ఈ నిధులు వెచ్చించారు. దీంతో అభివృద్ధి పనులెలా ఉన్నా.. పార్టీ శ్రేణుల పంట పండింది. 2011-12లో జిల్లాకు ఎస్డీసీ కింద రూ.14.47 కోట్లు విడుదలయ్యాయి. మంథని, హుస్నాబాద్, మానకొండూరు, కోరుట్ల నియోజకవర్గాల్లో 384 పనులకు వీటిని కేటాయించారు. వీటిలో 302 పనులు పూర్తయ్యాయి. 2012-13లో హుస్నాబాద్, మానకొండూరు, హుజూరాబాద్, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో 214 పనుల పేరిట రూ.9.57 కోట్లు విడుదలయ్యాయి. వీటిలో 109 పనులు పూర్తవగా.. మిగతా 105 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గత ఏడాది చివర్లో ఎన్నికలకు ముందు మంథని, మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 262 పనులకు రూ.7.28 కోట్లు కేటాయించారు. అందులో కేవలం 20 పనులు పూర్తయ్యాయి. 242 పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇప్పుడీ నిధులు ఆపేయటంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిత్తరపోతున్నారు.