
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్‌లుక్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.
ఇందులో బన్నీ పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో అలరించబోతుండగా అతడికి లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్ నేడు పుష్ప టైటిల్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ చెప్పిన సమయాని కంటే కొంత ఆలస్యంగా పుష్ప ది రైజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment