అర్హ.. అర్హ.. అర్హ.. అదరహా | Allu Arjun shares reprised version of Anjali Anjali | Sakshi
Sakshi News home page

అర్హ.. అర్హ.. అర్హ.. అదరహా

Published Sun, Nov 22 2020 5:58 AM | Last Updated on Sun, Nov 22 2020 5:58 AM

Allu Arjun shares reprised version of Anjali Anjali - Sakshi

‘అంజలి అంజలి.. అంజలి... చిలికె నవ్వుల పువ్వుల జాబిలి..’ పాటలో బేబీ షామిలీ చేసే సందడి చాలా బాగుంటుంది. అప్పటి పిల్లలకు ‘అంజలి’ (1990) సినిమాలోని ఈ పాట అంటే ఓ క్రేజ్‌. ఇప్పటికీ పాపులర్‌. ఇప్పుడు ఈ పాటలో అల్లు అర్హ చేసిన సందడి ఆకట్టుకునే విధంగా ఉంది. అల్లు అర్జున్‌–స్నేహ ముద్దుల కుమార్తె అర్హ పుట్టినరోజు శనివారం (నవంబర్‌ 21). నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏట అడుగుపెట్టింది ఈ చిన్నారి. ఈ బర్త్‌ డేకి కూతురికి మంచి బహుమతి ఇవ్వాలనుకున్నారు.

‘అంజలి..’ పాటను అర్హ మీద రీ క్రియేట్‌ చేసి, ఓ వీడియో తయారు చేయించారు. ఈ పాటలో క్యూట్‌గా ఒదిగిపోయింది అర్హ. సూర్య ఛాయాగ్రాహకుడిగా, గణేశ్‌ స్వామి కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో అర్హ తాతయ్య అల్లు అరవింద్, తండ్రి అల్లు అర్జున్, అన్నయ్య అయాన్‌ కూడా కనబడతారు. ఈ పాటను ఇలా రీ క్రియేట్‌ చేసినందుకు ‘అంజలి’ చిత్రదర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఇళయరాజాకు అల్లు ఫ్యామిలీ స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement