
ప్రేమ, పెళ్లి, విడాకులు.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలు. చాలామంది సెలబ్రిటీలు ప్రొఫెషనల్ లైఫ్‌లో రాణించినా పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినప్పటికీ దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతుంటారు. మెగా డాటర్ నిహారిక- చైతన్య జొన్నలగడ్డ విషయంలోనూ ఇదే జరిగినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో హడావుడి చేసే ఈ జంట కొంతకాలంగా గప్‌చుప్ అయిపోయింది. గత నెలలో చైతన్య తమ పెళ్లి ఫోటోలు సైతం డిలీట్ చేశాడు. ఇద్దరూ ఒకరినొకరిని అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో వీరి మధ్య వైరం నడుస్తోందని, విడాకులు తథ్యమని ప్రచారం జోరందుకుంది. తాజాగా నిహారిక కూడా తమ పెళ్లి ఫోటోలు, చైతన్యతో కలిసి దిగిన పిక్స్ డిలీట్ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది.
అన్ని ఫోటోలు తొలగించిన నిహారిక ఒక్కటి మాత్రం అలాగే ఉంచేసింది. ఇందులో పెళ్లి మండంలో చైతన్య పక్కనే ఉంది నటి. కాకపోతే అందులో చైతన్యను కొంత బ్లర్ చేసినట్లుగా ఉంది. 'నా దగ్గర ఓ రహస్యం ఉంది. కానీ మీకు చెప్పేస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది? సారీయే, చెప్పలేను' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఈ ఒక్క ఫోటో మాత్రం ఎందుకు అలాగే ఉంచేశావ్? మర్చిపోయావా? అని ఆరా తీస్తున్నారు. ఇకపోతే నిహారిక తన పెళ్లి వేడుకల్లో చైతన్యతో కాకుండా ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సైతం అలాగే ఉంచేసింది.
కాగా 2020 ఆగస్టు 13న చైతన్య, నిహారికల నిశ్చితార్థం జరిగింది. కరోనా కారణంగా పెళ్లి కొంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అదే ఏడాది డిసెంబర్ 9న వీరు పెళ్లిపీటలెక్కారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment