విరుష్క జంటపై బీగ్‌ బీ ఫన్నీ కామెంట్‌! | Amitabh Bachchan Cracks A Joke On Anushka Sharma And Virat Kohli | Sakshi
Sakshi News home page

విరుష్క జంటపై బీగ్‌ బీ ఫన్నీ కామెంట్‌!

Published Sun, Apr 4 2021 3:12 PM | Last Updated on Sun, Apr 4 2021 3:45 PM

Amitabh Bachchan Cracks A Joke On Anushka Sharma And Virat Kohli - Sakshi

ముంబై: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా  ఉండే అమితాబ్ బచ్చన్,  విరాట్ కోహ్లీ పేరుపై జోక్‌ వేశాడు. బచ్చన్ తరచూ రోజువారిగా  జరిగిన సంఘటనలను, తన బ్లాగ్‌లో, సోషల్ మీడియాలో సరదాగా నెటిజన్లతో పంచుకుంటాడు. శనివారం ఓ ఆసక్తి కరమైన విషయాన్ని పోస్ట్‌ చేశాడు బీగ్‌ బీ. అదేంటంటే  "అనుష్కకు భారీ అపార్ట్మెంట్ ఉంది!"అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. ఏంటి ఇక్కడ జోక్‌ ఏం ఉందని ఆలోచిస్తున్నారా..! అసలు విషయం ఏంటంటే  హిందీలో ‘ అనుష్క కే పాస్‌  విరాట్‌ ఖోలీ హై’ ను ఇంగ్లీషులో అనుష్క హాజ్‌ ఏ యూజ్‌ అపార్ట్‌మెంట్‌ అని అనువాదించాడు.

ఇక్కడ కోహ్లీ పేరును హిందీలో ఖోలీగా రాశాడు. ఖోలీ అంటే హిందీలో  గది అని,  విరాట్‌ను ఇంగ్లీషులో ​హ్యూజ్‌ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.  బీగ్‌ బీ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా తన పోస్ట్‌లో హోళీ పండుగ గురించి రాశాడు. కాగా, ప్రస్తుతం బిగ్‌ బీ రష్మికా మందనతో ఓ సినిమా షూటింగ్‌ మొదలుకానుంది.

చదవండి:  అమితాబ్‌ సినిమా విడుదల మళ్లీ వాయిదా, కారణం ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement