
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకి లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
కాగా, అమితాబ్ ఆ మధ్య కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆయన పాజిటివ్ నిర్థారణ కావడంతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘మేడే’, ‘గుడ్‌బై’చిత్రాల్లో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్ నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment