Sreemukhi Latest Photos, Viral On Social Media | Anchor Sreemukhi Latest HD Photos - Sakshi
Sakshi News home page

Sreemukhi: లంగా ఓణిలో ‘రాములమ్మ’.. ‘పచ్చదనం’ అదిరిందమ్మా!

Sep 26 2021 1:34 PM | Updated on Sep 26 2021 2:02 PM

Anchor Sreemukhi Latest Photos Goes Viral - Sakshi

యాంకర్‌గా, నటిగా తనదైన మాటతీరులో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది తెలుగు అమ్మాయి ‘శీముఖి’. బుల్లితెరపై తన ప్రతిభతో ‘రాములమ్మ’గా పేరు సంపాదించింది. 

మిగతా యాంకర్స్ తో పోల్చితే చాలా తక్కువ కాలంలో శ్రీముఖి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఓ వైపు టీవీ షోలో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ కనిపిస్తుంది. 2012 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

 ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది. నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించింది. 

 బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడిండి ఈ బుల్లితెర రాములమ్మ.

ఇటీవల ఆమె ‘క్రేజీ అంకుల్స్‌’మూవీతో ప్రేక్షకులను పలకరించింది. 

వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ

ఫన్నీ వీడియోలతో పాటు హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ లంగా ఓణిలో ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. పచ్చని ఓణీ, బంగారు రంగు పరికిణీ ధరించి అచ్చమైన తెలుగు అమ్మాయిలా రెడీ అయింది. 

లంగా ఓణికి  తగ్గట్టుగా ఆభరణాలు ధరించి ఎంతో అందంగా ముస్తాబైంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement