అనుష్క.మహేశ్‌బాబు, సితార
‘అమ్మాయిలూ... మీ కలల్ని నెరవేర్చుకోండి. ధైర్యంగా నిలబడండి. మీ గొంతు వినపడేలా చేయండి’ అంటున్నారు మహేశ్ బాబు, అనుష్క. ఆదివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భంగా తమ సోషల్ మీడియాలో ఈ విషయం గురించి స్ఫూర్తివంతమైన వాక్యాలు రాసుకొచ్చారు మహేశ్‌బాబు, అనుష్క. ‘‘అమ్మాయిలు ప్రపంచాన్ని కాంతివంతం చేస్తారు. కానీ వెలుగు చూడటానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. మన దేశానికి స్పిరిట్ అమ్మాయిలే అని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
అమ్మాయిలతో నిలబడదాం. వాళ్ల గొంతు వినపడేలా చేద్దాం. వాళ్ల హక్కుల కోసం నిలబడదాం’’ అన్నారు అనుష్క. మహేశ్ మాట్లాడుతూ –‘‘కూతురికి మించిన గొప్ప బహుమతి ఏదీ లేదంటాను నేను. తన ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్న మా అమ్మాయి (సితార)ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ధైర్యంగా ఉండు. నీకు రావాల్సిన దానికోసం పోరాడు. నీ కలల్ని సాకారం చేసుకో’’ అని కుమార్తె సితార ఫొటోను షేర్ చేశారు. అలాగే ప్రపంచంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉండేలా అందరూ కృషి చేయాలని కూడా మహేశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment