Anushka Sharma Heartfelt Note To Virat Kohli: He Quit His Test Captaincy Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Anushka Sharma: టెస్ట్‌ కెప్టెన్సీకి విరాట్‌ గుడ్‌బై.. అనుష్క ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sun, Jan 16 2022 4:07 PM | Last Updated on Sun, Jan 16 2022 4:23 PM

Anushka Sharma Heartfelt Note To Virat Kohli He Quit His Test Captaincy - Sakshi

Anushka Sharma Heartfelt Note To Virat Kohli He Quit His Test Captaincy: టీమిండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్‌ కోహ్లి తన టెస్ట్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్‌ వేదికగా శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 7 ఏళ్ల కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్తతో సోషల్‌ మీడియాలో విరాట్‌ ట్రెండింగ్‌లో ఉన్నాడు. విరాట్ నిర్ణయంతో అతని అభిమానులు ఎంతగానో షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే విరాట్‌ భార్య, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ తన ఇన్‌స్టా గ్రామ్‌లో టెస్ట్‌  కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విరాట్‌పై ఎమోషనల్‌గా సుధీర్ఘమైన పోస్ట్‌ చేసింది. 

'2014లో టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలని ఎంఎస్‌ నిర్ణయం తీసుకున్నందునే నిన్ను కెప్టెన్‌గా చేశారని నువ్‌ చెప్పిన రోజు నాకు గుర్తుంది. ఆ రోజు తర్వాత ఎంఎస్‌, నువ్‌, నేను చాట్‌ చేసుకున్నాం. నీ గడ్డం ఎంత త్వరగా నెరిసిపోతుందో అని అతను సరదాగా చెప్పాడు. దాని గురించి మనం బాగా నవ్వుకున్నాం. ఆ రోజు నుంచి నేను నీ గడ్డం నెరసిపోవడమే కాకుండా చాలా చూశాను. నేను అపారమైన అభివృద్ధిని చూశాను. నీ చుట్టూ, నీలోపల నవ్‌ ఎదిగిన తీరు చూశాను. భారత జాతీయ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నీ ఎదుగల, నీ నాయకత్వంలో జట్టు సాధించిన విజయాల గురించి నేను చాలా గర్వపడుతున్నాను. అంతకన్నా ఎక్కువగా నీలో నువ్‌ సాధించిన అభివృద్ధికి నేను మరింతగా గర్వపడుతున్నాను. మీరు చేసిన ఏ పనిలో ఎలాంటి దురుద్దేశం లేదు. నువ్‌, నా ప్రేమ అపరిమితం. ఈ ఏడేళ్లుగా తన తండ్రి నేర్చుకోవడాన్ని మన కుమార్తె చూస్తుంది.' అంటూ విరాట్‌ను ప్రేమగా ముద్దాడిన చిత్రాన్ని షేర్‌ చేసింది అనుష్క.
 


ఇదీ చదవండి: రానున్న మరొక క్రికెటర్‌ బయోపిక్‌.. లీడ్‌ రోల్‌లో అనుష్క ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement