Bachpan Ka Pyar Song: Anushka Sharma Shares Funny Meme Pic Of Her Sleep - Sakshi
Sakshi News home page

‘బచ్ ప‌న్ కా ప్యార్’ పాట నిద్రపోనివ్వడం లేదు: అనుష్క శర్మ

Published Thu, Jul 29 2021 6:00 PM | Last Updated on Thu, Jul 29 2021 6:46 PM

Anushka Sharma Obsession With Viral Song Bachpan Ka Pyar - Sakshi

‘బచ్ పన్ కా ప్యార్ హై’... ఇప్పుడు ఎక్కడ, ఎవరి నోట విన్న ఇదే పాట వినిపిస్తుంది. ఈ పాటను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్‌ డిర్డో అనే బాలుడు తమ పాఠశాలలో పాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఈ బుడ్డోడు ఒక్క పాటతో రాత్రికిరాత్రే సెలబ్రిటీగా మారిపోయాడు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల నోళ్లలో ఇదే నానుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోని చాలామంది సెలబ్రెటీలు తమ స్టోరీస్‌లో పెట్టుకుంటున్నారు.  తాజాగా ఈ సాంగ్‌కు బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా  ఫిదా అయిపోయారు.

ఈ మేరకు బుధవారం అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ మీమ్‌ షేర్‌ చేశారు .రాత్రి ప్రశాంతంగా పడుకుందామనుకునే సమయంలో ‘బచ్‌పన్‌ కా ప్యార్‌ హై’ అనే పాట నా నోటిలోనే నానుతుంది’ అని తెలియజేసేలా ఓ మీమ్‌  షేర్‌చేశారు. ఎంత ప్రయత్నించిన తన మెదడులోనుంచి పాట తొలిగిపోవడం లేదన్నట్లు పోస్టు చేశారు. అనుష్క శర్మ ప్రస్తుతం భర్త విరాట్‌ కోహ్లితో కలిసి బ్రిటన్‌లో ఉంది.

కాగా, జూలై 3న షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 9 మిలియన్ల వ్యూవ్స్‌ సంపదపాదించింది. మేరా బచ్‌పన్ కా ప్యార్ హై అంటూ బాలుడు పాడిన పాటపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఆ బాలుడిని చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బాఘేల్ ప్రశంసలతో ముంచెత్తారు. ఆ పిల్లవాడిని తన వద్దకు పిలిచి మరి బ‌చ్ ప‌న్ కా ప్యార్ అంటూ పాట పాడించుకుని దీవించారు. అంతే కాకుండా ఈ వీడియోను సీఎం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ బాలుడికి మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement