
‘అమ్మానాన్న.. ఓ తమిళ అమ్మాయి’ మూవీతో తెలుగు తెరపై మెరిసింది మలయాళ బ్యూటీ అసిన్. తొలి చిత్రంతోనే సూపర్ హిట్‌ను అందుకున్న ఆమె ఆ తర్వాత వరుసగా సౌత్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. హీరో సూర్యతో ‘గజిని’, నాగార్జునతో ‘శివమణి’, పవన్‌తో ‘అన్నవరం’ వంటి చిత్రాల్లో నటించారు. గజిని మూవీ ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. హిందీలో అమిర్ ఖాన్‌తో ‘గజిని’ రిమేక్‌లో నటించించారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చి అక్కడ పలు చిత్రాల్లో నటించిన ఆమెకు మెల్లిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో 2016లో అసిన్ మైక్రోమాక్స్ సహా వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. వీరికి 2017లో కూతురు అరిన్ జన్మించింది. అయితే అసిన్ సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమాలను పలకరిస్తూనే ఉన్నారు.
తన కూతురికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె మురిసిపోతుంటారు. తాజాగా అరిన్ కథక్ ప్రాక్టిస్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘వీకెండ్ కథక్ ప్రాక్టిస్’ అంటూ మూడేళ్ల వయసులోనే తన కూతురు కథక్ నేర్చుకుంటుందని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో అరిన్‌ను చూసి నెటిజన్లంతా షాక్ అవుతున్నారు. ‘ఇంత చిన్న వయసులోనే అరిన్ కథక్ నేర్చుకుంటుందా.. సో క్యూట్’ అంటూ నెటిజన్లు ఆమె ఫాలోవర్స్ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా అసిన్ చివరగా అభిషేక్ బచ్చన్ ‘ఆల్ ఈజ్ వెల్‌కమ్’ చిత్రంలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment