![Assam Singer Zubeen Garg Hospitalised With Head Injury - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/20/siger.jpg.webp?itok=g4I2q1GB)
ప్రముఖ గాయకుడు, సంగీత స్వరకర్త జుబీన్ గార్గ్ ప్రమాదానికి గురయ్యారు. గువాహటిలో ఉన్న తన నివాసంలోని బాత్రూంలో కాలుజారి పడ్డారు. ఈ క్రమంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే గువాహటిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సిటీ స్కాన్ చేయగా తలకు బలమైన గాయం తగిలినట్లు గుర్తించారు. ఆయన తలపై ఐదు కుట్లు పడినట్లు తెలుస్తోంది.
(చదవండి: కటౌట్‌లా లేదు.. కట్ డ్రాయర్ యాడ్‌లా ఉంది.. నెటిజన్ ట్రోల్స్)
కాగా, జుబీన్ గార్గ్ ఆరోగ్యం గురించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆరా తీశారు. ఆయనకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన చికిత్సకై ఇతర ప్రాంతాలకు తరలించుట కోసం ఎయిర్ అంబెలెన్స్‌ని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. గార్గ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాల్సిందిగా ఆరోగ్యశాఖ మంత్రిని సీఎం కోరారు.
తనదైన గాత్రంతో వందలాది పాటలు పాడిన జుబీన్ గార్గ్.. అసోంలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘గ్యాంగ్‌స్టర్’లోని ప్రసిద్ధ యాలీ పాట జుబిన్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. పలు అస్సాం, బెంగాలీ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment