పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్ | Ayesha Jhulka Approach Bombay High Court For Pet Dog Death | Sakshi
Sakshi News home page

కుక్క మరణం.. మూడున్నరేళ్లుగా న్యాయం కోసం నటి పోరాటం

Published Sat, Apr 13 2024 11:48 AM | Last Updated on Sat, Apr 13 2024 12:06 PM

Ayesha Jhulka Approach Bombay High Court For Pet Dog Death - Sakshi

చాలామంది సెలబ్రిటీల దగ్గర పెట్ డాగ్స్ ఉంటాయి. వాటిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. సొంత పిల్లల్లా చూసుకుంటూ ఉంటారు. బాలీవుడ్ నటి ఆయేషా జుల్క దగ్గర కూడా అలానే శునకాలు ఉన్నాయి. అందులో ఓ శునకాన్ని అన్యాయంగా చంపేశారని ఈమె ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. ఇంతకీ అసలేం జరిగింది? ఈ కేసు సంగతేంటి?

(ఇదీ చదవండి: హీరోయిన్ దివ్య భారతి చనిపోవడానికి కారణమదే.. హీరో షాకింగ్ కామెంట్స్)

హిందీతో పాటు కన్నడ, తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి ఆయేషా జుల్కా. ఈమె టాలీవుడ్ లోనూ 'నేటి సిద్ధార్థ', 'జై' చిత్రాల్లో నటించింది. ఇకపోతే ఈ నటి.. వీధి కుక్కల్ని సంరక్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిని పెంచుకుంటూ ఉంటుంది. అలా రాఖీ అనే శునకాన్ని ఇంటికి తెచ్చుకుంది. అయితే  2020 సెప్టెంబరులో ఇది అనుమానస్పద రీతిలో చనిపోయింది. అయితే దీని చావుకి కారణం తమ కేర్ టేకర్ రామ్ ఆండ్రే అని అతడిపై పోలీస్ కేసు పెట్టింది.

దీంతో 2021లో ఛార్జ్ షీట్ నమోదు చేసిన పోలీసులు.. ఆయేషా ఇంట్లో పని చేసే రామ్ ఆండ్రేని అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత అతడు బెయిల్ పై బయటకొచ్చేశాడు. అప్పటి నుంచి ఈ కేసు అలానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయమై బొంబే హైకోర్టు మెట్లెక్కిన ఆయేషా.. తన సత్వరమే న్యాయం చేయాలని కోరింది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement