
ఒకప్పుడు సినిమాలు యాభై రోజులు, వంద రోజులు, నూట యాభై రోజులు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు రెండు, మూడు వారాలకే థియేటర్ల నుంచి మాయమవుతున్నాయి. అలాంటిది చిన్న సినిమా బలగం యాభై రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. థియేటర్‌లోనూ, ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ సినిమాలో నటీనటులు చాలా సహజంగా నటించారు. హీరోహీరోయిన్లకే కాకుండా ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టుకు మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీలో కొమురయ్య కూతురు లచ్చవ్వగా నటించిన రూపలక్ష్మికి మరింత గుర్తింపు వచ్చింది. అందరూ ఆమెను తమ ఇంటి ఆడపిల్లగా అక్కున చేర్చుకున్నారు.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మా పేరెంట్స్‌కు మేము ఆరుగురం. నేను మూడు నెలల పసికందుగా ఉన్నప్పుడు ఎకనామిక్స్ ప్రొఫెసర్‌కు దత్తత ఇచ్చారు. అలా చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమయ్యాను. నన్ను పెంచిన తండ్రే నా ప్రపంచం. ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. 15 ఏళ్ల వయసులో నా పెళ్లి జరిగింది. అప్పుడు నా కన్నతల్లి చనిపోయింది.
బాల్యంలో ప్రేమకు, బంధుత్వానికి దూరమయ్యాను. నా జీవితంలో ఉన్న ఏకైక సంతోషం మా నాన్న(దత్తత తండ్రి). నాకు 19 ఏళ్లు వచ్చినప్పుడు ఆయన దూరమయ్యారు. నా జీవితంలో జరిగిన చేదు సంఘటనల వల్లే నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది రూపలక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment