Bheemadevarapally Branchi Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమా రివ‍్యూ

Published Fri, Jun 23 2023 6:07 PM | Last Updated on Fri, Jun 23 2023 11:39 PM

Bheemadevarapally Branchi Review And Rating In Telugu - Sakshi

టైటిల్: భీమదేవరపల్లి బ్రాంచి
నటీనటులు: అంజి వల్గుమాన్, సాయి ప్రసన్న, రాజవ్వ తదితరులు
నిర్మాణ సంస్థ: ఏబీ సినిమాస్ & నిహాల్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: బత్తిని కీర్తిలత, రాజ నరేందర్
దర‍్శకత్వం: రమేష్ చెప్పల
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ: కె.చిట్టిబాబు
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
విడుదల తేదీ: 2023 జూన్ 23

టాలీవుడ్ లో ఈ మధ్య తెలంగాణ కల్చర్ ఆధారంగా తీస్తున్న సినిమాల పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 'బలగం' లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. 'మేమ్ ఫేమస్' బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేసింది. అదే 'భీమదేవరపల్లి బ్రాంచి'. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
తెలంగాణలోని భీమదేవరపల్లి అనే పల్లెటూరు. జనాలు పూర్తిగా నిరక్షరాస్యులు. ఎవరైనా చదువుకున్నోడి వచ్చి ఏదైనా చెబితే అదే నిజమని నమ్మేంత అమాయకులు. కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ తెరవమని చెప్పగానే ఊరిలోని అందరూ వాటిని తీసుకుంటారు. తమ ఖాతాల‍్లో ప్రభుత్వం డబ్బులేస్తుందనే పుకారుని నమ్మేస‍్తారు. కొన్ని రోజుల తర్వాత అదే ఊరిలో డప్పు కొట్టుకుని బతికే జంపన్న(అంజి వల్గుమాన్) ఖాతాలో రూ.15 లక్షలు వచ్చి పడతాయి. అప్పటికే అ‍ప్పులతో సతమవుతున్న జంపన్న.. ఈ డబ్బులతో ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే.. 'భీమదేవరపల్లి బ్రాంచి' స్టోరీ.

ఎలా ఉందంటే?
కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెబుతుంది. జంపన్న అలానే చేస్తాడు. ప్రభుత్వం ఆ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తుందనే పుకారు నిజమే అనుకుంటాడు. కొన్నిరోజులకు జంపన్న తల్లి అకౌంట్ లో ఆ డబ్బులు పడతాయి. మనోడు ఎంత అమాయకుడంటే.. 'మా అమ్మ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. నాది, నా భార్య అకౌంట్ లో కూడా డబ్బులు వేయండి' అని ఏకంగా ప్రధానిమంత్రికి లేఖ రాస్తాడు. ఇలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. ఓవైపు నవ్విస్తూనే.. ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత పథకాల వల్ల ప్రజలు ఎలా సోమరిపోతులు అవుతున్నారనే విషయాన్ని సెటైరికల్ గా చూపించారు.

ఫస్టాప్ విషయానికొస్తే.. భీమదేవరపల్లి ఊరిలో మనుషులు, వాళ్లెంత అమాయకులో చూపించారు. జంపన్న క్యారెక్టర్, అతడి ఫ్యామిలీ గురించి సీన్ బై సీన్ చూపించారు. కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ తెరుచుకోమని చెప్పడం.. దీంతో ఊరి జనాలందరూ బ్రాంచికి వెళ్లి ఖాతాలు ఓపెన్ చేసుకోవడం, ఆ ఖాతాల‍్లో ప్రభుత్వం రూ.15 లక్షలు వేస్తుందనే రూమర్ నమ్మడం.. ఇలా తొలి భాగమంతా మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.

సెకండాఫ్ లోనూ అసలు స్టోరీ ఉంటుంది. ఖాతాలో వేసిన డబ్బుని జంపన్న ఖర్చు చేసేయడం వల్ల ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు. చివరకు ఏం తెలుసుకున్నాడు లాంటి పాయింట్స్ తో సినిమాను ఎండ్ చేశారు. ఫస్టాప్ ని బాగా తీసిన డైరెక్టర్.. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఎందుకో కాస్త డల్ అయిపోయాడు. ఎమోనషల్ గా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే స్కోప్ ఉన్నప్పటికీ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. కొన్ని సీన్స్ మరీ సినిమాటిక్ గా ఉన్నట్లు అనిపిస్తాయి. వాటిని చూసినప్పుడు.. ఇలాంటి నేచురలిస్టిక్ సినిమాల్లో అలాంటి సన్నివేశాలు లేకపోతే బెటర్ అనే విషయాన్ని దర్శకుడు ఎందుకు మరిచిపోయాడబ్బా అనిపిస్తుంది. 

ఎవరెలా చేశారు?
అంజి వల్గుమాన్, జంపన్న పాత్రకు సరిగ‍్గా సరిపోయాడు. ముందు ఒకలా, చేతికి డబ్బు వచ్చిన ఒకలా బిహేవ్ చేయడం లాంటి సీన్స్ లో బాగా నటించి అలరించాడు. జంపన్న భార్యగా నటించిన సాయిప్రసన్న, లేటు వయసులో పెళ్లి కోసం కలలు కనే వ్యక్తిగా 'బలగం' సుధాకర్ రెడ్డి, లింగం పాత్రలో గడ్డం నవీన్ ఇలా అందరూ తమ తమ రోల్స్ కి న్యాయం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జేడీ లక్ష‍్మీ నారాయణ, అద్దంకి దయాకర్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఇక చరణ్-అర్జున్ సినిమాకు సరిపోయే సంగీతమిచ్చారు. చిట్టిబాబు సినిమాటోగ్రఫీ బాగుంది. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ ఓకే. ఊరిలోని సీన్స్ కొన్ని ట్రిమ్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement