Bhojpuri Actor Akshara Singh Run Without Slippers On Scooter, Video Viral - Sakshi
Sakshi News home page

Akshara Singh: స్కూటీపై పారిపోయిన హీరోయిన్‌, వీడియో వైరల్‌

Published Wed, Dec 28 2022 3:48 PM | Last Updated on Wed, Dec 28 2022 4:42 PM

Bhojpuri Actor Akshara Singh  Run Without Slippers On Scooter, Video Viral - Sakshi

సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని తహతహలాడేవారు చాలామంది. అలాంటిది సెలబ్రిటీ ఎదురుగా కనిపిస్తే ఊరుకుంటారా? ఆరునూరైనా సరే ఫోటో సంపాదించాల్సిందేనని అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఫొటో ప్లీజ్‌ అంటూ వెంటపడుతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఎదురైంది భోజ్‌పురి హీరోయిన్‌ అక్షర సింగ్‌కు.

అక్షర సింగ్‌ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బీహార్‌లోని బేథియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. హీరోయిన్‌ కనిపించడంతో ఆగలేకపోయిన జనం సెల్ఫీల కోసం పరుగులు తీశారు. వందలమంది ఫోటో అంటూ ఎగబడటంతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఉన్నపళంగా అక్కడి నుంచి పారిపోయింది హీరోయిన్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అక్షర సింగ్‌ స్కూటీ మీద వెళ్తుండగా అభిమానులు ఆమె వెనకాల పరిగెత్తారు. కానీ చూడటానికి మాత్రం అందరూ ఆమెను తరుముతున్నట్లుగా ఉండటంతో హీరోయిన్‌కు ఎంత కష్టం వచ్చింది? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

చదవండి: ఫస్ట్‌ డే షూటింగ్‌.. బాబు చనిపోయాడు..: నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement