దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని ఇప్పటికి అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయస్సులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కష్టపడుతూ హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నాగార్జున ఆపిల్‌పై తన ఆగ్రహాన్ని ట్వీట్ చేశారు. భారత్‌లోని ఆపిల్ సంస్థ, దాని యాప్ స్టోర్ ని ట్యాగ్ చేస్తూ.. ‘మీరు ఆపిల్ ఉత్పత్తులను, ఐఫోన్ లను ఆపిల్ స్టోర్ ఇండియా నుండి కొనుగోలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి.. వారి సర్వీస్, విధానాలు ఏకపక్షంగా ఉండటంతో పాటు దారుణంగా ఉన్నాయని’ కోపంతో ఉన్న ఎమోజీని ట్విట్ ద్వారా తెలిపారు.(చదవండి: అందుకే మా నాన్నంటే అసూయ: మంచు విష్ణు)
BE CAREFUL When you buy Apple products from Apple store India… Their service and policies are one sided and terrible!! 😡@Apple @AppleSupport
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 9, 2020
హీరో నాగార్జున ఇటీవల కొన్న ఆపిల్ పరికరం ఏమిటి, దానిలో ఉన్న లోపం ఏమిటో అనేది ఇంకా తెలియలేదు. ఇటీవలే భారత్‌లో ఆపిల్ స్టోర్ ఆన్‌లైన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్‌ను అధికారిక యాపిల్ స్టోర్ ద్వారా కొనుగోలు చేస్తే ఉచితంగా ఎయిర్ పోడ్స్‌ను కూడా అందించే ఆఫర్‌ను ప్రారంభంలో ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో లేదు. ఇటీవలే యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12ప్రో, ఐఫోన్ 12ప్రో మ్యాక్స్ లను యాపిల్ ఆఫ్ లైన్ స్టోర్లతో పాటు, ఇతర ఆన్ లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ల సేల్‌ను నిర్వహిస్తోంది. నాగార్జున ట్వీట్లపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. యాపిల్ కంటే ఆండ్రాయిడ్ ఉత్పత్తులను వాడటమే మంచిదని, సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితులు నెలకొంటే ఇక సామాన్యుల సంగతి ఏమిటి అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment