బిగ్‌బాస్‌: ఫస్ట్‌ వీక్‌ నామినేషన్స్‌.. | Bigg Boss 4 First Week Elimination Process Started | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 4: ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

Published Mon, Sep 7 2020 10:39 PM | Last Updated on Tue, Sep 8 2020 3:39 PM

Bigg Boss 4 First Week Elimination Process Started - Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 16 మంది సెలబ్రెటీలు బిగ్‌బాస్‌ 4 హౌస్‌లో అడుగుపెట్టారు. తొలి రోజు గంగవ్వను హౌస్‌లోకి పంపి ముగించినబిగ్‌బాస్‌.. అసలు ఆటను రెండో రోజు అంటే సోమవారం నుంచి మొదలు పెట్టాడు. ఈ వారం ఎలిమినేషన్‌కు ఏడుగురిని ఎంపిక చేయడంతో పాటు, కరాటే కల్యాణి రచ్చ, జోర్దార్ సుజాత మాటల దాడి, ఏడుపులు పెడబొబ్బలు, ఓదార్పులతో రెండో రోజు ఎపిసోడ్‌ ముగిసింది. ఇక వివరాల్లోకి వెళితే.. 

బిగ్‌బాస్ హౌస్‌లో మార్నింగ్ వేకప్ సాంగ్ ‘సయ్యా.. సయ్యోరే’ తో ఎపిసోడ్‌ మొదలైంది. ఆ పాటకు గంగవ్వతో సహా మిగిలిన కంటెస్టెంట్స్‌ అంతా స్టెప్పులేశారు. ఇక సీక్రెట్ రూంలో ఉన్నఅరియానా, సొహైల్‌ కూడా తమదైన శైలీలో స్టెప్పులేసి అలరించారు. ఆ తర్వాత డైరెక్టర్‌ సూర్యకిరణ్‌ సింపుల్‌గా, అందరూ చేయగలిగే ఎక్స్‌ర్‌సైజ్‌ ఎంటో కంటెస్టెంట్స్‌కు చేసి చూపించాడు. అనంతరం కిచెన్‌లో డైరెక్టర్ రాజశేఖర్, సూర్య కిరణ్ తదితరులు కరాటే కల్యాణిపై జోక్‌లు వేసుకున్నారు. మరోవైపు సీక్రెట్ రూంలో ఉన్న అరియానా.. సోహైల్ వీపు మీద ఎక్కి కూర్చుని ఎక్స్‌ర్‌సైజ్‌ చేశారు. ఆ తర్వాత  బిగ్ బాస్ ఆటలో భాగంగా.. పోస్ట్ కార్డ్‌ ద్వారా ఒక లేఖను పంపి, స్లిప్‌లో రాసి ఇచ్చిన దాని గురించి వివరించాలని కోరారు. 

ఏ విషయాన్ని జీవితంలో ఒక్కసారైన ప్రయత్నించాలి అని అనుకుంటున్నారని అమ్మ రాజశేఖర్‌ సూర్యకిరణ్‌ను అడగ్గా.. తాను మందు, సిగరేట్‌ తాగడం అమ్మ దగ్గర దాచానని, ఈ షోద్వారా అమ్మకు ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.  ఇక మీ ఊరి గురించి చెప్పాలనిమోనాల్‌కి స్లిప్ అందించగా.. ఊరు విషయాన్ని పక్కనపెట్టి తన తండ్రి చనిపోయాడని, అంకుల్‌ ఒక్కరే తమను చూసుకుంటున్నారని ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి..  గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అందరూ గంగవ్వను ఓదార్చారు. ఇక కిరణ్‌ కలగజేసుకొని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తండ్రి గురించి చెప్పడమేంటని మోనాల్‌పై కాస్త సీరియస్‌ అయ్యారు. అభిజిత్‌ కలగజేసుకోని ఆమె ఫీలింగ్‌ని చెబుతోందని, వద్దనడానికి మనం ఎవరమని అన్నాడు. ఇక్కడ కాస్త గొడవ జరిగింది. అనంతరం మెహబూబ్ దిల్‌సే సైతం తనపేరెంట్స్‌ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు.
(చదవండి : గంగవ్వకు‌ ఎమ్మెల్యే శుభాకాంక్షలు)

 ఇక సీక్రెట్ రూంలో ఉన్న సొహైల్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ఫోన్ చేసి బిగ్‌బాస్ పేరుతో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. అయితే ఆ ఫోన్ జోర్దార్ సుజాత లిఫ్ట్‌ చేయడం.. ఫోన్‌ మాట్లాడింది బిగ్‌బాస్‌కాదని, అతని పక్కన ఓ అమ్మాయి ఉందని నోయల్‌ అనడం.., ఫోన్ చేసింది ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా.. బిగ్ బాసేనా లేక ఫోన్ చేసింది ఎవరా అన్నది తెలుసుకోవాలి కదా అని కల్యాణి అనడంతో సుజాత కన్నీళ్లు పెట్టుకుంది. మరోసారి సోహైల్‌ సిక్రేట్‌ రూమ్‌ నుంచి  ఫోన్‌ చేయగా కల్యాణి లిఫ్ట్‌ చేసింది. తాను బిగ్‌బాస్‌ని అని, ఫుడ్‌ ఆర్డర్‌ ఏమైందని అడిగాడు. ఫుడ్‌ అంతారెడీగా ఉందని కల్యాణి చెప్పగా.. పంపించాలని బిగ్‌బాస్‌ వాయిస్‌తో సోహైల్‌ చెప్పాడు. ఇక సొహైల్ అడిగినట్టుగానే కిచెన్, సాంబార్ చేసి రూంకి పంపించారు. 

ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే..
ఆ తర్వాత ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అందరిని హాల్లోకి పిలిచిన బిగ్‌బాస్‌.. నామినేషన్స్ ప్రక్రియను షురూ చేశారు. ఇద్దరు ఇద్దరు చొప్పున వెళ్లి.. గార్డెన్ ఏరియాలో ఉన్న కిటికీల దగ్గరనిలబడాలని.. మిగిలిన ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇద్దరిలో ఒకర్ని నామినేట్ చేసి.. డోర్ క్లోజ్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. మొదటిగా అభిజిత్, దేత్తడి హారికలు నామినేషన్ కోసం వెళ్లి కిటికీల దగ్గరకు వెళ్లగా.. ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో అభిజిత్‌ని ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు. అలా దేవి- సూర్య కిరణ్‌జంటలో  సూర్యకిరణ్‌, కల్యాణి-అఖిల్‌ జంటలో అఖిల్‌, అమ్మ రాజశేఖర్‌-దివి జంటలో దివిని, లాస్య-మెహబూబ్‌ దిల్‌సే జంటలో మెహబూబ్‌, సుజాత-మోనాల్‌ గజ్జర్‌ జంటలో సుజాత, నోయల్‌-గంగవ్వ జంటలో గంగవ్వను ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంగా నామినేట్‌ చేసి, మిగిలిన వారిని సేఫ్‌ చేశారు. అయితే గంగవ్వ నామినేట్‌ చేసే విషయంతో కొంతమంది తెలివిగా ప్రవర్తించారు. గంగవ్వకు చాలా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని, కచ్చితంగా ఆమె సేఫ్‌ అవుతారంటూనే ఆమెను నామినేట్‌ చేశారు. మొత్తానికి ఈ వారంలో ఎలిమినేషన్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వ ఉన్నారు. 

ఇక నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం హౌస్‌లోకి ఓ పోస్ట్‌ పంపిచాడు బిగ్‌బాస్‌. అందులో ‘చందమామ లాంటి ఇంటికి ఒక మచ్చ ఉంది. ఆ మచ్చే కట్టప్పలా మీ ఆటకు అడ్డు పడొచ్చు. మీతోనే ఉంటూ మీకు నష్టం కలిగించవచ్చు. ఆ కట్టప్ప మీ 14 మందిలో ఒకరు ఉండొచ్చు’ అంటూ ట్విస్ట్ ఇవ్వడంతో కట్టప్ప ఎవరన్న ఇంటిసభ్యుల్లో ఆసక్తిగా మారింది.ఇక రేపటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టాస్క్‌లో భాగంగా కరాటే కళ్యాణి టీచర్ అవతారం ఎత్తింది. ఆమెపై గంగవ్వ వేసిన పంచులు.. ఇంకా హౌస్‌లో ఏమోమో జరిగిందో రేపటి ఎపిసోడ్‌లో చూసేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement