సొట్టబుగ్గల సుందరి దివి వైద్య బిగ్‌బాస్ నాల్గో సీజన్ నుంచి ఈ మధ్యే ఎలిమినేట్ అయింది. మాటల కన్నా చేతలకు ప్రాధాన్యమిచ్చింది. ఈ షో ద్వారా తన భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంది. నాగార్జున దగ్గర వీడ్కోలు తీసుకోకుండానే షో నుంచి వెళ్లిపోయింది. దివి ఎలిమినేట్ అయిందన్న విషయాన్ని ఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దివి తన బిగ్‌బాస్ జర్నీ గురించి ఎన్నో విశేషాలను పంచుకుంది. ఈ మేరకు ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో దివి మాట్లాడుతూ..
పప్పు వల్ల వారమంతా సఫర్ అయ్యాం
బయటకు వచ్చేస్తా అనుకోలేదు. దసరా రోజే ఎలిమినేట్ కావడం బాధనిపించింది. అయితే నేను ఎలా వెళ్లానో అలానే బయటకు వచ్చేశాను. బిగ్‌బాస్ హౌస్ అనేది ఒక కల, డ్రగ్. అందులో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. లాస్య అక్కతో నాకంత కనెక్షన్ లేదు. పైగా అప్పటికే మాకు చాలా గొడవలయ్యాయి. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ఆలోచనతో నేను స్వయంగా నామినేషన్‌లోకి వచ్చాను. ఆమె ఇంట్లో అందరికీ వంట చేసి పెడుతుంది. అలాంటి వ్యక్తిని ఇంకా బాధపెట్టి ఏడిపించదల్చుకోలేదు. అంతకు ముందు జరిగిన నామినేషన్‌లో పప్పు కారణంతో ఆమెను నామినేట్ చేయడం అందరూ సిల్లీ అనుకుంటున్నారు. కానీ ఆరోజు అక్క వండిన పప్పు వల్ల నేను, మోనాల్, సుజాత, కుమార్ సాయి కాస్త అస్వస్థతకు గురయ్యాం. విరేచనాలు, వాంతింగులతో వారమంతా ఇబ్బంది పడ్డాం. చివరికి ఓఆర్ఎస్ తాగాల్సి వచ్చింది. అందుకే నేను పప్పు రీజన్ చెప్పాను. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ఎంత అవసరమో మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. (చదవండి: బిగ్‌బాస్ హోస్టింగ్‌పై సమంత మనసులోని మాట)
మొదట్లో సైలెంట్‌గా ఎందుకు ఉన్నానంటే..
హౌస్‌లోకి అడుగు పెట్టగానే చాలా మంది ఏడుస్తున్నారు. ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. తొలిరోజే అందరూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అందుకని మూడు రోజుల వరకు అందరినీ ఓ కంట గమనిస్తూ సైలెంట్‌గా ఉండిపోయా. దానివల్లే మార్నింగ్ మస్తీలో అందరిగురించి కరెక్ట్‌గా చెప్పగలిగా. ఇక ఒక నటిగా నేను అందంగా కనిపించాలి. చిన్న గాయం తగిలినా అది ఎఫెక్ట్ అవుతుంది. మా అమ్మ నాకు ఏదైనా దెబ్బ తగులుతుందని బైక్ కూడా కొనివ్వలేదు. కాబట్టి ఫిజికల్ టాస్కులో కాళ్లు విరగ్గొట్టుకునేందుకు నేను హౌస్‌కు వెళ్లలేదు. అయితే ఫిజికల్ టాస్కులంటే నేను భయపడతానని సుజాత చెప్పడంతో పేడ తొట్టిలే కూర్చునే టాస్క్‌ను మరో ఆలోచన లేకుండా పూర్తి చేశా. మూడు గంటలు దానిలో కూర్చోవడం నేను జీవితంలో మర్చిపోలేను. (చదవండి: నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న నోయల్)
అభిజిత్ ఓవర్ కాన్ఫిడెన్స్
హౌస్‌లో ఎవరితో పెద్దగా కనెక్షన్ లేదు. అమ్మ రాజశేఖర్‌తో తప్ప! ఆయన నాపై చూపించే కేరింగ్ నిజమని నమ్మాను. కానీ అతని వల్ల నేను, నా గేమ్ ప్రభావితం అయితే కాలేదు. ఒకవేళ ఆయన నా వెనకాల ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం కచ్చితంగా ఖండిస్తాను. అతనితోనే ఉండటం వెనక ఎలాంటి ఉద్దేశ్యమూ లేదు. ఇక తనను జనాలు సేవ్ చేస్తారని అభిజిత్ కాన్ఫిడెంట్‌తో పడవ టాస్కులో నుంచి దిగేయడం నాకు నచ్చలేదు. నాగార్జున సర్ కూడా ఇదే పాయింట్‌ను ప్రస్తావించారు. చివరికి సమంత చేతుల మీదుగా వీడ్కోలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎలిమినేషన్ తర్వాత కంటెస్టెంట్లతో టెలిఫోన్‌లో సంభాషించాను. కానీ అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదో తెలియదు. బిగ్‌బాస్‌కు ముందు నాకు సీరియల్స్‌లో అవకాశం వచ్చింది. కానీ టీవీ కన్నా సినిమాలు, వెబ్ సిరీస్‌ల మీదే నాకు ఫోకస్ ఉంది. ఇక హౌస్‌లో సినిమా చేసిన టాస్క్ ఉంది కదా.. అందులో అఖిల్, మోనాల్ మధ్య రొమాంటిక్ సీన్‌లను నేనే డైరెక్ట్ చేశాను. కానీ బయట మాత్రం నాకు నటిగా మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను అని దివి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment