
చిత్రపరిశ్రమలో ఓవర్‌నైట్ స్టార్ అయినవాళ్లు ఎంతమందున్నారో తెలీదు కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఒక్క ఎపిసోడ్‌తో పాపులర్ అయినవాళ్లలో దివిలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ సీజన్ ప్రారంభమైన కొత్తలో ఆమె మూడు రోజులు గుంభనంగా, నోట్లో నాలుక లేనట్లుగా మౌన దీక్షలో ఉండిపోయింది. దీంతో దివి ఒక్క మాట మాట్లాడితే చూడాలనుంది అంటూ సోషల్ మీడియాలో జపాలు ప్రారంభించారు. వారి కృషి ఫలించింది. ఆమె ఎట్టకేలకు మాట్లాడింది. ఆమె ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి ఒక్కో పాయింట్ చెప్తూ ఉంటే ప్రేక్షకులకు దిమ్మ తిరిగిపోయింది. ఆ తర్వాత డ్యాన్సు, పాటలు, నటన చూసి ఎంతోమంది ఆమెకు ఫిదా అయ్యారు. సొట్టబుగ్గల చిన్నదానిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయారు. అలా ఒక్క సంఘటనతో ఆమెను ఆరాధించే వారిసంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. మొన్న సోహైల్ సడన్‌గా కోపానికి రాగా దివి మాత్రం అతన్ని మాటలతో ఢీ కొట్టింది. అలా తాను రౌడీ బేబీ అని కూడా నిరూపించుకుంది.
అప్పుడు లాస్య చేసిన తప్పే ఇప్పుడు దివి..
కానీ ఇప్పుడు దివి ట్రాక్ తప్పుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆమె ఆట సరిగానే ఆడుతోందా? అప్పటికీ, ఇప్పటికీ దివి ఒకేలా ఉందా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కారణం.. ఆమె ఇతర విషయాల్లో దూరదు. కానీ గత వారం నాగార్జున ఎదుట మోనాల్ క్యారెక్టర్‌ను తక్కువ చేసేలా వ్యాఖ్యానించింది. దాని పర్యవసానాలు మోనాల్‌ను వెంటాడుతున్నాయి. అయితే గతంలో.. లాస్య ఓ విషయంలో తన పేరును ప్రస్తావించినందుకు దివి షటప్ అంటూ వేలెత్తి మరీ వార్నింగ్ ఇచ్చింది. మాస్టర్ తనకు మధ్య జరిగిన దానికోసం మూడో వ్యక్తివి నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ అని విరుచుకుపడింది. (బిగ్ బాస్ : దివి ‘పప్పు’ రీజన్‌పై నెటిజన్ల ట్రోలింగ్)
మోనాల్ క్యారెక్టర్ గురించి దివి కామెంట్లు
కానీ దివి గతవారం నిస్సిగ్గుగా మోనాల్ ట్రయాంగిల్ స్టోరీ గురించి నాగ్ సమక్షంలో ప్రేక్షకులకు వివరించి చెప్పుకొచ్చింది. దీంతో షాకైన మోనాల్ తన గురించి ఏమీ తెలీకుండా తప్పుగా మాట్లాడవద్దని కన్నీళ్లు పెట్టుకుంది. తనను బ్యాడ్ చేయవద్దని అర్థించింది. అయినా మళ్లీ ఇదే విషయం గురించి దివి నిన్న అవినాష్‌తో కబుర్లాడింది. ట్రయాంగిల్ స్టోరీ అంటూ గుసగుసలు పెట్టింది. ఇక్కడివరకే ఫ్రెండ్‌షిప్ అని ఆ ఇద్దరికీ(అభిజిత్, అఖిల్‌కు) మోనాల్ ఓ క్లారిటీ ఇవ్వాలి, కానీ అది జరగడం లేదంటూ ఆమె గురించి వ్యతిరేకంగా మాట్లాడింది.
మోనాల్ గురించి దివి గుసగుసలు
అసలు మూడో వ్యక్తి గురించి వెనకాల మాట్లాడొద్దు అని కుండబద్ధలు కొట్టిన దివియే నాగ్ ముందు మోనాల్‌ను బ్యాడ్ చేసి పెద్ద తప్పు చేసిందంటే ఇప్పుడు మళ్లీ ఆమె గురించే మాట్లాడటమేమిటని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె సరిగ్గానే చెప్పిందని వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా దివి ఇతరుల కోసం, ముఖ్యంగా మోనాల్ కోసం గుసగుసలు పెట్టడం తగ్గిస్తే బాగుంటుందని ఆమె అభిమానులే అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే రానున్న వారాల్లో దివికి వేసే ఓట్ల సంఖ్యకు గండి పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. (బిగ్‌బాస్: గంగవ్వ భజన చూడలేక..)
మాస్టర్ వెళ్లిపోతే దివికి ప్లస్ అవుతుందా?
మొన్నటికి మొన్న లాస్య వండిన పప్పు తింటే ఇంటి సభ్యులకు మోషన్స్ అయ్యాయి అంటూ ఓ చిల్లర కారణం చెప్పి సోషల్ మీడియాలో అల్లరిపాలైంది. అలాగే టాస్కులో దెబ్బలు తగిలాయని సోహైల్‌ను నామినేట్ చేయడంపైనా నెటిజన్లు సెటైర్లు విసిరారు. ఇక టాస్కులోనూ మాస్టర్‌తో కలిసి ఆడుతోంది. మోసగాళ్లకే మోసగాడైన మాస్టర్‌ను నమ్ముతున్న దివి గతి ఏమవుతుందోనని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మాస్టర్ ఎలిమినేట్ అయితే దివికి అసలు పరిస్థితి బోధపడుతుందని అభిప్రాయపడుతున్నారు.