బిగ్‌బాస్ ఆడే ఆటలో కంటెస్టెంట్లు పావులు. అందరిన కలిపేది, విడగొట్టేలా పథకం రచించేది బిగ్‌బాసే.. అఖిల్, మోనాల్ దూరమవుతారని ఎవరూ ఊహించలేదు. కానీ విడిపోయి ఆమెను ఒంటరిని చేశాడు. అఖిల్, అభిజిత్ బద్ధ శత్రువులు అనుకున్నారు. కానీ స్నేహితులుగా మారిపోయారు. అయితే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా నామినేషన్ ప్రక్రియ రాగానే అఖిల్.. అభిజిత్‌నే నామినేట్ చేసి షాకిచ్చాడు. తాను బోల్డ్, ధైర్యానికి మారుపేరు, చివరి వరకు పోరాడుతానని చెప్పుకునే అరియానా ఇప్పుడు హౌస్‌లో ఉండటమే తన వల్ల కాదని చేతులెత్తేస్తోంది.
ఫ్రెండ్‌షిప్ అనేది బక్వాస్: అఖిల్
తాజాగా ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ కెప్టెన్సీ కోసం 'ఆఖరి బంతి' అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో కూడా అభిజిత్ తమ మెదడుకు పని చెప్పినప్పటికీ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. చివరికి పోటీలో అఖిల్, మెహబూబ్ ఇద్దరు మాత్రమే నిలిచినట్లు స్పష్టమవుతోంది. అయితే ఒకరినొకరు కెప్టెన్ చేసుకోవడం మాత్రం ఇద్దరికీ ఇష్టం లేదు. ఈ క్రమంలో అఖిల్ ఫ్రస్టేట్ అవుతూ.. ఈ రిలేషన్స్, ఫ్రెండ్‌షిప్స్ అంతా బక్వాస్ అని చెప్పాడు. మరోవైపు సోహైల్ మాట్లాడుతూ.. నేను, అఖిల్ ఉంటే నువ్వు కచ్చితంగా అఖిల్‌నే సేఫ్ చేస్తావు అని మోనాల్‌తో అన్నాడు. దీనిపై మోనాల్ స్పందిస్తూ.. రేపు పొద్దున ఏ పరిస్థితిలోనైనా నువ్వు, నేను అన్న ఆప్షన్ వచ్చినప్పుడు అఖిల్ తప్పకుండా నిన్నే సేవ్ చేస్తాడు అని కౌంటరిచ్చింది. దీంతో సోహైల్‌కు ఏం మాట్లాడాలో తెలీక నేలచూపులు చూశాడు. (చదవండి: బిగ్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్‌లోకి అఖిల్!)
మనసు గెలిచేసిన మోనాల్
ఇక మోనాల్ మనసులో నుంచి వచ్చిన ఆ ఒక్క మాట అందరి హృదయాలను కదిలించివేసింది. ఆమె అఖిల్, సోహైల్ మధ్య మనస్పర్థలు రావడానికి కారణమైందని తిట్టిపోసిన వారు ఇప్పుడేమంటారు అని ప్రశ్నిస్తున్నారు. తనకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదని బాధ పడుతున్న అఖిల్‌కు మోనాల్ అండ ఉందని చెప్తున్నారు. ఈ డైలాగ్‌తో మోనాల్ ఎంత క్లారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మొదట్లో నెగెటివిటీని మూటగట్టుకున్న మోనాల్ ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతోంది. ఎలాంటి మాస్క్ లేకుండా సొంతంగా గేమ్ ఆడుతూ అభిమానులను పెంచుకోవడంతో పాటు ఓట్లను ఆకర్షిస్తోంది. (చదవండి: అవినాష్ జబర్దస్త్ రీఎంట్రీ ఉంటుంది)
Comments
Please login to add a commentAdd a comment