చెండాల‌మైన కార‌ణాల‌తో నామినేట్ చేయకు | Bigg Boss 4 Telugu: These 6 Contestants Are In Eighth Week Nominations | Sakshi
Sakshi News home page

మెహ‌బూబ్ వ‌ల్లే అభి, మోనాల్ మ‌ధ్య దూరం!

Published Mon, Oct 26 2020 11:24 PM | Last Updated on Tue, Oct 27 2020 2:47 AM

Bigg Boss 4 Telugu: These 6 Contestants Are In Eighth Week Nominations - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో మోనాల్ ట్ర‌యాంగిల్ స్టోరీ బ‌య‌ట మాత్ర‌మే కాదు, హౌస్‌లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆరోవారం నామినేష‌న్‌లో మోనాల్ పేరును తీస్తూ అఖిల్‌, అభిజిత్ గొడ‌వ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. దీన్ని నాగార్జున సైతం త‌ప్పుప‌ట్టాడు. కానీ ఈసారి ఏకంగా ఈ ముగ్గురి విష‌యంలోకి అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌ల‌దూర్చాడు. వారి మ‌ధ్య మ‌రింత అగాధాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు క‌నిపించింది. ఇక అరియానాకు స్నేహితులే శ‌త్రువుల‌య్యారు. మ‌రి నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో ఎవ‌రెవరు ఎవ‌రెవ‌ర్ని నామినేట్ చేశారో చ‌దివేసేయండి..

అభిజిత్ గురించి పాజిటివ్‌గా రాసిన అఖిల్‌
త‌న‌తో మాట్లాడుతున్న‌ప్పుడు బాగా క‌నిపిస్తావు, కానీ డైటింగ్ మానేసి తిన‌డం మొద‌లెట్టు అని అభిజిత్ గురించి అఖిల్‌ పాజిటివ్‌గా రాసి వారి మ‌ధ్య స్నేహం మొద‌లైంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. త‌ర్వాత‌ హౌస్‌లో బ‌తుక‌మ్మ ఆడారు. అనంత‌రం ఎనిమిదో వారానికిగానూ నామినేట్ చేయాల‌నుకున్న ఇంటిస‌భ్యుల ఫొటోల‌ను సుత్తితో ప‌గ‌ల‌గొట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొద‌ట‌గా వ‌చ్చిన లాస్య‌.. త‌న‌ను క‌న్నింగ్ స్మైల్ అన‌డం న‌చ్చ‌లేద‌ని అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను, త‌న‌తో మంచిగా మాట్లాడుతూనే, స‌డ‌న్‌గా మాట్లాడ‌టం మానేస్తావ‌ని మోనాల్‌ను నామినేట్ చేసింది. త‌ర్వాత అఖిల్‌.. ఇత‌రులు చెప్పేది విన‌దని అరియానాను, సింప‌థీ ప‌దం వాడ‌టం న‌చ్చ‌డం లేద‌ని మాస్ట‌ర్‌ను నామినేట్ చేశాడు. మెహ‌బూబ్‌.. మ‌న మ‌ధ్య అన్నీ క్లియ‌ర్ అవాలని అరియానాను, త‌ర్వాత మోనాల్‌ను నామినేట్ చేశాడు. (చ‌ద‌వండి: నాన్న డిఫెన్స్ ఉద్యోగి, కానీ..:  నోయ‌ల్ త‌మ్ముడు)

మోనాల్ గురించి మేము కొట్లాడుకోలేదు: అఖిల్‌
అవినాష్‌.. త‌న‌కు, లాస్య‌కు మ‌ధ్య దూరం పెరిగిపోయింద‌ని, త‌న‌కు టీ పోయలేద‌ని ఆమెను నామినేట్ చేశాడు. కొంటె రాక్ష‌సులు టాస్క్‌లో నూటికి నూరు శాతం ప‌ర్ఫామెన్స్ ఇవ్వ‌లేద‌ని హారిక‌ను నామినేట్ చేశాడు. దీన్ని అంగీక‌రించని హారిక.. తాను పూర్తి స్థాయిలో ప‌ర్ఫామెన్స్ ఇచ్చాన‌ని, నిజానికి అఖిల్ బాగా చేయ‌లేద‌ని ఫైర్ అయింది. సింప‌థీ అనేది సెంటిమెంట‌ల్‌గా ఉండే సినిమా ప‌దం మాత్ర‌మేన‌ని మాస్ట‌ర్ క్లారిటీ ఇచ్చాడు. మోనాల్ అభిజిత్‌తో మాట్లాడ‌కుండా ఉంటే ఆమెకు క్లోజ్ ఫ్రెండ్‌గా ఉన్న నువ్వు సైలెంట్‌గా ఉండ‌టం న‌చ్చ‌లేద‌ని అఖిల్‌తో చెప్పుకొచ్చాడు. దీంతో సీరియ‌స్ అయిన అఖిల్‌.. మోనాల్ గురించి మేము కొట్లాడుకుని మాట్లాడుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. చెండాల‌మైన కార‌ణాల‌తో నామినేట్ చేయ‌కండ‌ని మండిప‌డ్డారు. ఇక కుమార్ సాయిని 'బాగా ఆడినా స‌రే, నువ్వు అక్క‌డున్నావ్' అన్న మాట త‌న‌కు న‌చ్చ‌లేద‌ని మాస్ట‌ర్ ఉన్న‌మాట‌నే చెప్పాడు. కానీ అప్ప‌టికే నిప్పులు క‌క్కుతున్న ఇద్ద‌రి మ‌ధ్య‌ గొడ‌వ ముదిరిపోవ‌డంతో.. మాకు ఫీలింగ్స్ ఉండ‌వా? మాకు అమ్మానాన్న లేరా? అని ఒక‌రి మీద ఒక‌రు అరుచుకున్నారు. త‌ర్వాత క‌న్నింగ్ అని కామెడీగా చెప్పినా ఫీల‌వుతున్నార‌ని లాస్య‌ను నామినేట్ చేశాడు.

మెహ‌బూబ్‌పై అరియానా ప్ర‌శ్న‌ల వ‌ర్షం
'క్లియ‌ర్ అవ్వాల‌నుకున్న‌వాళ్లు ఇంట్లో నుంచి పంపించేస్తారా? అవినాష్ స్ట్రాంగ్ అని ఫీలింగ్ ఉన్న‌ప్పుడు నాకెందుకు సాయం చేశావు? ఎందుకు కంపేర్ చేశావు? సారీ చెప్తూనే ఎందుకు నామినేట్ చేశావు?' అంటూ వ‌రుస ప్ర‌శ్న‌లు కురిపించిన అరియానా.. ఇదంతా డ‌బుల్ గేమ్ అని అర్ధ‌మ‌య్యింది‌, ఇదే నాకు న‌చ్చ‌లేదంటూ మెహ‌బూబ్‌ను నామినేట్ చేసింది. నామినేష‌న్ స‌మ‌యంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అంటూ అఖిల్‌ను నామినేష‌న్‌లోకి పంపించింది. 'ఏమ‌నుకోకు, మెహ‌బూబ్‌తో నిన్ను స‌మానం అనుకున్నా. కానీ నాగ్ స‌ర్ నిన్ను నాకు సారీ చెప్పుమ‌న్న‌పుడు ఆలోచించావు, అది ఒక్క‌టే. ఇక చెప్ప‌డానికి ఏమీ లేదు, నాకు వేరే ఆప్ష‌న్ లేదు' అంటూ సోహైల్ త‌న స్నేహితురాలు అరియానాను నామినేట్ చేశాడు. ఆవేశాన్ని అణుచుకుని మీరు కూడా నాలా కూల్‌గా మారిపోతే బాగుంటుంద‌ని అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను నామినేట్ చేశాడు. తాను ముందుకు వెళ్లాలంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌ను పంపించేయాల‌ని చెప్తూ నోయ‌ల్.. మెహ‌బూబ్‌, అఖిల్‌ను నామినేష‌న్‌లోకి పంపించాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : తొలిసారి అవినాష్‌.. సోహైల్‌ రిక్వెస్ట్‌)

నువ్వే మా మ‌ధ్య గొడ‌వ‌ను పెద్ద‌ది చేశావు: మోనాల్‌
"ఇలాంటి రోజు వ‌స్తుంద‌ని అనుకోలేదు. నా గురించి వేరే వాళ్ల‌తో మాట్లాడ‌కు. న‌న్ను మానిప్యులేట‌ర్ అని ఎందుకు పిలిచావ‌నేది త‌ర్వాత తెలిసింది. నా దృష్టిలో అది పెద్ద నేరం" అంటూ అభిజిత్‌.. మోనాల్‌ను నామినేట్ చేశాడు. మాస్ట‌ర్ గురించి చెప్తుంటే ఆయ‌న అడ్డుప‌డటంతో కార‌ణం చెప్ప‌కుండానే అత‌డిని నామినేట్ చేశాడు. నీతో మాట్లాడేట‌ప్పుడు అవ‌త‌ల వారికి కూడా అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని హారిక.. అరియానాను, స్ట్రాంగ్ కంటెస్టెంటు కాబ‌ట్టి మెహ‌బూబ్‌ను నామినేట్ చేస్తున్న‌ట్లు పేర్కొంది. అభికి త‌న‌కు ఉన్న గొడ‌వ‌ను నువ్వు 50 రెట్లు ఎక్కువ చేశావ‌నిపించింది అంటూ మోనాల్‌.. మెహ‌బూబ్‌ను నామినేట్ చేసింది. 'ఆరో వారంలో నాకు ఆరోగ్యం బాగోలేన‌ప్పుడు లాస్య‌ను నాకోసం వండ‌మ‌ని అడిగితే న‌న్నే చేసుకోమ‌ని చెప్పింది. దీంతో నాకు నేనే ప‌న్నీరు వండుకున్నా' అని చెప్పింది. దీనిపై స్పందించిన లాస్య‌.. 'నేను అప్పుడు బిజీగా ఉన్నాను, వేరేవాళ్ల‌కు చెప్పొచ్చు క‌దా' అని అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించింది. ఇక‌పై త‌న‌ పేరు, అభిల్‌, అఖిల్ టాపిక్ క‌లిపి తీయ‌కండ‌ని చేతులెత్తి క‌న్నీళ్ల‌తో అభ్య‌ర్థించింది. ఇక ఈ వారం అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అరియానా, మెహ‌బూబ్‌, లాస్య‌, అఖిల్‌, మోనాల్ నామినేట్ అయ్యారు. (చ‌ద‌వండి: న‌ర‌కం చూపించిన ఆ ఇద్ద‌రే బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement