
Shruti Haasan Turns Tamil Bigg Boss 5 Reality Show Host: బిగ్‌బాస్ రియాలిటీ షోలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌లో 5 రోజులు ఒకేత్తు అయితే శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే వీకెండ్ ఎపిసోడ్ మరో ఎత్తు. ఆ 5 రోజులు హౌజ్‌లో రచ్చ రచ్చ చేస్తూ, గొడవలతో దారి తప్పే హౌజ్‌మేట్స్‌ను సెట్ చేయాలన్నా, రకరకాల టాస్క్‌లతో కంటెస్టెంట్స్‌కి సంతోషాన్ని పంచాలన్నా అది బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించే వారికే దక్కుతుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో స్టార్స్ హోస్ట్స్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు డబుల్ వినోదాన్ని పంచుతున్నారు.
చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి
అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు బిగ్‌బాస్ హోస్ట్స్ అందుబాటులో లేకపోతే.. వారి స్థానంలో మరొక సెలబ్రెటీ షో హోస్ట్‌గా వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతేడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 హోస్ట్ నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో ఆ వీకెండ్ ఎపిసోడ్స్ టీఆర్‌పీ రేసులో ముందంజలో దూసుకుపోయాయి. తాజాగా తమిళ బిగ్‌బాస్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ షోకు విలక్షణ నటుడు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన కమల్ కరోనా బారిన పడ్డాడు.
చదవండి: పునీత్ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్, ఆర్‌ఆర్‌ఆర్ టీం ఫిదా
ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో కమల్ మరో రెండు వారాల పాటు అందుబాటులోకి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో కమల్ స్థానంలో హోస్ట్‌గా స్టార్ హీరోయిన్, ఆయన కూతురు శ్రుతీ హాసన్‌ను దింపేందుకు తమిళ బిగ్‌బాస్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రుతి హాసన్‌ను హోస్ట్‌గా పెడితే ఈ షో మరింత ఆసక్తిగా మారుతుందనే ఉద్దేశంతో నిర్వాహకులు ఇలా ప్లాన్ చేస్తున్నారట. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఆ దిశగా ప్లాన్ చేస్తూ శ్రుతిని సంప్రదించారట. మరి దీనికి ఆమె ఒకే చెప్పిందో లేదో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వేచి చూడాలి. కాగా తమిళంలో కూడా బిగ్‌బాస్ సీజన్ 5 నడుస్తోన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment