
వంశీగారు నన్ను మొదటిసారి చూసినప్పుడు హీరోయిన్‌గా చేయాల్సినవాళ్లు ఇలాంటి పాత్రలెందుకు చేస్తున్నారని అడిగారని, ఇది తనకు పెద్ద కాంప్లిమెంట్..
Bigg Boss Telugu 5 Contestant Uma Devi Home Tour: బిగ్‌బాస్ షోను అల్లాడించింది ఉమాదేవి. 'కార్తీకదీపం' సీరియల్‌తో భాగ్యంగా ఫేమస్ అయిన ఈమె బిగ్‌బాస్ షోతో ఉమత్తగా మరింత పాపులర్ అయింది. ఒకరిని నవ్వించాలన్నా, నలుగురితో పోట్లాడాలన్నా ఆమెకు ఆమే సాటి. నాకు ఒకరు ఎదురొచ్చినా, నేను ఒకరికి ఎదురెళ్లినా వాళ్లకే రిస్క్ అన్న డైలాగ్ ఆమెకు సరిగ్గా సరిపోతుంది. కంటెస్టెంట్లతో కయ్యానికి కాలు దువ్వుతూ నెగెటివ్ టాక్ పెంచుకున్న ఈమె రెండోవారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత ఉమాదేవి సొంతంగా 'ఉమత్త' అనే యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెట్టింది. ఈ మధ్యే తను ఇల్లు మారానని చెప్తూ ఆ ఇంటిని చూపిస్తూ హోమ్ టూర్ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో తన ఇంటికి సంబంధించిన విశేషాలు పంచుకుంది. ఈ ఇంటిలో వంటగది, పూజ గదితో పాటు రెండు బెడ్‌రూమ్‌లు ఉన్నాయి.
చదవండి: Bigg Boss Telugu 5: సిరి, షణ్నుకు నాగ్ సపోర్ట్, సన్నీని వాయించేశాడుగా!
ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తూర్పుముఖంగా ఉందని, అది తనకు కలిసొచ్చిందని చెప్పుకొచ్చింది. రమణ మహర్షి ఫొటోలతో పాటు ఆయన పుస్తకాలు కూడా తన దగ్గర ఉన్నాయంది. తనకు వచ్చిన అవార్డులను చూపిస్తూ మురిసిపోయింది. తను మొట్టమొదటగా వసంత కోకిల సీరియల్‌లో నటించానని, ఆ సీరియల్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు ప్రత్యేక అవార్డు ఇచ్చారని తెలిపింది. నేను చేసిన ప్రతి సినిమాలు 100 రోజులు విజయవంతంగా నడవడం గర్వకారణమని పేర్కొంది.
పెద్ద వంశీగారు నన్ను మొదటిసారి చూసినప్పుడు హీరోయిన్‌గా చేయాల్సినవాళ్లు ఇలాంటి పాత్రలెందుకు చేస్తున్నారని అడిగారని, ఇది తనకు పెద్ద కాంప్లిమెంట్ అని చెప్పుకొచ్చింది. ఇంట్లో ఉన్న బొమ్మలు, ఫ్రిజ్ చూపిస్తూ దాని వెనక చరిత్రను వివరించింది. మొత్తంగా ఈ ఇల్లే తన చిన్న ప్రపంచమని చెప్తూ హౌస్ మొత్తాన్ని చూపించింది ఉమాదేవి.