బిగ్‌బాస్.. బుల్లితెరపై ఈ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్ షో మొదలైందంటే చాలు.. అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్ షోకు సీజన్ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో గత బిగ్‌బాస్ నాల్గో సీజన్ సూపర్ హిట్ అయ్యింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన వారికి 105 రోజుల పాటు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది బిగ్‌బాస్-4.
ఇక స్టార్ మా వీలైనంత తొందరగా బిగ్‌బాస్ సీజన్-5ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో నాగార్జున హోస్ట్‌గా ఈ షో చేయలేనంటూ నిర్వహకులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన సినిమాల షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ సారి హోస్ట్‌గా చేయలేనని చెప్పడంతో హీరో రానా పేరు తెరపైకి వచ్చింది. సీజన్-5 హోస్ట్‌గా బిగ్‌బాస్ మేకర్స్.. హీరో రానాతో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే రానా కూడా దీనికి నో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా బిగ్‌బాస్ హోస్ట్‌గా రానాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఇప్పటికే రానా ‘నెంబర్ వన్ యారీ’ వంటి ప్రోగ్రాంలకు యాంకర్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
దీంతో రానాకున్న క్రేజ్‌ను బట్టి ఈ సీజన్‌ను అతడితో చేయించి మంచి మార్కెట్ సంసాదించుకోవాలన్న స్టార్ మాకు నిరాశే ఎదురైంది. ఆయన అడిగినంత పారితోషికం కూడా ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు. కానీ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ షో చేయలేనని, అంతేగాక బిగ్‌బాస్ లాంటీ షో చేయడం అంటే కాస్త రిస్క్‌తో కూడుకుందని భావించి రానా ఈ ఆఫర్‌ను తిరస్కరించాడని టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే సెప్టెంబర్ వరకు వేచి చూడాలి. ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపికలో తుది దశకు చేరుకున్న ఈ షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment