
Sweta Varma In Bigg Boss 5 Telugu: శ్వేత వర్మ ముక్కుసూటి మనిషి. ఎంత అందంగా ఉంటుందో అంత నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని గట్టిగా వాదించినవారిలో ఈమె ఒకరు. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో 18వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన శ్వేత వర్మ అందరికీ ఇచ్చిపడేస్తానంటోంది. తనతో పెట్టుకుంటే దేత్తడి పోచమ్మ గుడే అని వార్నింగ్ ఇస్తోంది.
ఎంతో డేర్ అండ్ డాషింగ్‌గా కనిపించే ఈ భామ ద రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్, సైకిల్ తదితర చిత్రాల్లో నటించింది. మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న ఈ భామ తన ముక్కుసూటితనంతో ఇంట్లో తగాదాలు కొనితెచ్చుకుంటుందా? మిగతా కంటెస్టెంట్లకు కొరకరాని కొయ్యగా మారనుందా? అనేది మున్ముందు తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment