
ఈ మధ్యే ఎలిమినేట్ అయిన శ్వేత వర్మ బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసింది. ఆ కంటెస్టెంటే విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంది..
Bigg Boss Telugu 5, Swetha Varma About Bigg Boss Winner: బిగ్‌బాస్ షో ఎటు పోతుందో అర్థం కావడంలేదు అంటున్నారు నెటిజన్లు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పంపించేసి ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుకుంటున్నవారిని హౌస్‌లో ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయితే అందులో ఐదుగురు ఆడవాళ్లనే పంపించేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆరో వారంలో బయటకు వచ్చేసిన శ్వేత వర్మ ఎలిమినేషన్‌ను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె హౌస్‌లోకి తిరిగి వస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పట్లో రీఎంట్రీ అనే ఆప్షన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఇదిలా వుంటే తాజాగా శ్వేత వర్మ బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసింది. వీజే సన్నీ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంది. హౌస్‌లో అతడు స్ట్రాంగ్, పాపులర్ కంటెస్టెంట్ అని పేర్కొంది. ఇక ప్రియ, సన్నీకి మధ్య జరిగిన గొడవను ప్రస్తావిస్తూ.. వాళ్లిద్దరికీ కొట్లాట జరిగింది వాస్తవమే కానీ మెజారిటీ ప్రేక్షకులు అదంతా ప్రియ వల్లే జరిగిందని నిందిస్తూ సన్నీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక సన్నీతో పాటు మానస్, యానీ మాస్టర్ టాప్ 3లో ఉంటారని తెలిపింది.