![Bigg Boss 6 Telugu: Abhinaya Sri Shocking Comments on Bigg Boss - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/20/bb.jpg.webp?itok=1IwCRpM5)
బిగ్‌బాస్ తనకి అన్యాయం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది నటి అభినయ శ్రీ. బిగ్‌బిస్ 6వ సీజన్‌లో ఆమె హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రెండో వారం నామినేషన్లో భాగంగా అందరిక కంటే తక్కువ ఓట్లు వచ్చిన షానీ, అభినయలు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. హౌజ్‌లో ఉన్నప్పుడు, బయటకు వచ్చాక కూడా షానీ వాయిస్ పెద్దగా ఎక్కడ వినిపించడం లేదు.
చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’
కానీ, అభినయ మాత్రం బయటకు వచ్చాక బిగ్‌బాస్ షోపై విరుచుకుపడుతోంది. బిగ్‌బాస్ అంటే అంతా మోసమంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. బయటకు వచ్చిన అనంతరం ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హౌజ్‌లో తను బెస్ట్ అవ్వకపోయినా ఎఫర్ట్స్ మాత్రం పెట్టానంది. తాను ఆడలేదంటే అసలు ఒప్పుకోనని, హౌజ్‌లో అందరితో మాట్లాడుతూ వారితో కలిసిపోయానని చెప్పింది. ‘మొదటి రోజు నుంచే బిగ్‌బాస్ స్క్రీన్‌పై నన్ను అసలు చూపించలేదు. అలాగే 24 అవర్స్ షోలో కూడా నన్ను చూపించలేదు
చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ
. ఈ విషయం నాకు మా అమ్మ, నా స్నేహితులు చెబితే తెలిసింది. బయటకు వచ్చాక చూసుకుంటే నాకు ఏస్థాయిలో బిగ్‌బాస్‌లో అన్యాయం జరిగిందో అర్థమైంది. దీని ద్వారా నేనేంటో ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీ రీఎంట్రీ ఇద్దామని ఆశలతో వచ్చిన నాకు బిగ్‌బాస్ పెద్దగా ఉపయోగపడలేదు’ అంటూ అభినయ వాపోయింది. ఇక బిగ్‌బాస్ 2 వారాలకి గాను తనకి బిగ్‌బాస్ నుంచి రూ. 5 లక్షలు అందినట్లు వార్తలు వస్తుండగా ఆమె వాటిని కొట్టిపారేసింది. తనది అంత పెద్ద మొత్తం పారితోషకం కాదని, బిగ్‌బాస్ తనకు రూ. 5 లక్షలు ఇచ్చాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment