Bigg Boss 6 Telugu: Arohi Eliminated Fourth Week , News Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: నాలుగో వారం ఊహించని ఎలిమినేషన్‌.. ఆమె ఔట్‌!

Published Sun, Oct 2 2022 11:18 AM | Last Updated on Sun, Oct 2 2022 11:35 AM

Bigg Boss 6 Telugu: Arohi Eliminated, News Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ -6 చూస్తుండగానే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే  ఈ బిగ్‌ రియాల్టీ నుంచి ముగ్గురు ఎలిమినేట్‌ అయ్యారు. మొదటి వారం ఎవ్వరిని ఎలిమినేట్‌ చేయని బిగ్‌బాస్‌..రెండో వారంలో షానీ, అభినయ శ్రీలను బయటకు పంపాడు. ఇక మూడో వారంలో అనూహ్యంగా నేహా చౌదరి ఎలిమినేట్‌ అయింది. నాలుగో వారంలో 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వారిలో నుంచి ఒకరు నేడు బయటకు వెళ్తారు. ఆ ఒక్కరు ఎవరనేది ఈ రోజు అంటే ఆదివారం సాయంత్రం తెలిసిపోతుంది. 

అయితే నామినేషన్స్‌లో ఉన్నవారిలో రేవంత్‌ గీతూ, శ్రీహాన్‌లకు ఎక్కువ ఓట్లు పడి నేవ్‌ అయినట్లు తెలుస్తోంది. శ్రీసత్యతో పులిహోర కారణంగా అర్జున్‌ కూడా ఈ వారం ఇంట్లోనే ఉండడం ఖాయం. ఇక  రాజ్‌, కీర్తి, సుదీప, సూర్య, ఆరోహి, ఇనయాలలో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని ఈ వారం మొదటి మూడు రోజుల్లోనే అంతా పసిగట్టారు. కానీ అనూహ్యంగా ఇనయాకు కూడా భారీ ఓటింగ్‌ సంపాధించి అందరికి ఝలక్‌ ఇచ్చింది. ఇక చివరికి సుదీప, సూర్య, ఆరోహిలో డేంజర్‌ జోన్‌లో పడ్డారు.

తాజా సమాచారం ప్రకారం వీరిలో నంచి ఆరోహి ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. సూర్యతో ట్రాక్‌, మాటలు కాస్త కటువుగా ఉండడం ఆరోహి ఎలిమినేషన్స్‌కి కారణమైంది. బిగ్‌బాస్‌కు ముందు జనాలకు ఆమె గురించి పెద్దక తెలియకపోవడం కూడా మైనస్‌ అయింది. మొత్తంగా నాలుగో వారం ఎలిమినేట్‌ అయ్యేది ఆరోహినే అని నెటిజన్స్‌ తేల్చేశారు. అంతేకాదు ఆమెపై మీమ్స్‌ క్రియేట్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement