నాగ్‌కు గిఫ్ట్‌ ఇచ్చి బుట్టలో పడేసిన బాహుబలి సింగర్‌ | Bigg Boss 7 Telugu: Damini Bhatla Entered as 3rd Contestant, - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: మూడో కంటెస్టెంట్‌గా బాహుబలి సింగర్‌ దామిని

Published Sun, Sep 3 2023 7:40 PM | Last Updated on Mon, Sep 25 2023 12:53 PM

Bigg Boss 7 Telugu: Damini Bhatla Entered as 3nd Contestant - Sakshi

పచ్చబొట్టేసిన.. పిల్లగాడా నీతో.. పాటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది దామిని. ఈమె పుట్టి పెరిగింది రాజమండ్రిలో అయినా తర్వాతి కాలంలో తన కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయింది. దామిని సోదరి మౌనిమ సైతం సింగర్‌గా రాణిస్తోంది. ఈమె బాహుబలి: ద కన్‌క్లూజన్‌లో పాటలు ఆలపించింది. కాగా దామిని.. 2011లో పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో రెండో స్థానంలో నిలిచింది. తన గాత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమెకు సినిమాలో పాడే అవకాశాలు వచ్చాయి.

అయితే సినిమా పాటలే కాకుండా సొంతంగా ఆల్బమ్స్‌ కూడా చేస్తోంది దామిని. స్టేజీ షోల ద్వారా సైతం తన గాత్రంతో సంగీతప్రియులను ఉర్రూతలూగిస్తోంది. కొండపొలం సినిమాలో ఈమె పాడిన ధమ్‌ ధమ్‌ ధమ్‌ పాటకు ఇటీవలే జాతీయ అవార్డు వచ్చింది. తాజాగా స్టేజీపై ఈ పాట మరోసారి పాడి అదరగొట్టింది దామిని. హార్ట్‌ షేపులో ఉన్న సిరామిక్‌ మగ్‌ ఇచ్చి నాగార్జునను బుట్టలో పడేసింది సింగర్‌. ఈ గిఫ్ట్‌ తాను స్వయంగా తయారు చేశానంది దామిని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement