
ఇతడి బాడీ చూస్తే మీకీపాటికే అర్థమైపోయుంటుంది మోడల్ అని! ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇతడు మోడలింగ్‌లో ఇప్పటికే సత్తా చాటాడు. కానీ తెలుగువారికి మాత్రం పెద్దగా పరిచయం లేడు. ఆ మధ్య తెలుగులో ఓ సీరియల్‌లో నటించినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో ఛాన్సులు లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు ప్రిన్స్ యావర్. ఏదైనా ఉద్యోగం చేద్దామని ప్రయత్నాలు చేశాడు.
ఇందుకోసం అమీర్‌పేటలో రూ.7 లక్షలు పెట్టి ఓ కోర్సు కూడా నేర్చుకున్నాడు. ఉద్యోగం కోసం వెతుకులాట మొదలుపెట్టిన సమయంలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకునేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు? అందుకే క్షణం ఆలోచించకుండా వెంటనే ఓకే చేశాడు. ఇప్పుడిప్పుడే తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి ఇతడు హౌస్‌లో మిగతావాళ్లతో కలిసిపోతాడా? తడబడతాడా? అనేది చూడాలి. అన్నట్లు బిగ్‌బాస్ బ్రీఫ్‌కేస్ ఆఫర్ చేసినా తనకు వద్దని నిర్మొహమాటంగా చెప్పేశాడు.
Comments
Please login to add a commentAdd a comment