
ఒడిశాలో పుట్టిపెరిగిన శుభశ్రీ రాయగురు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. చిన్నప్పటినుంచే చదువుల్లో ముందున్న ఆమె ముంబైలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసింది. చదివింది లాయర్ అయినప్పటికీ శుభశ్రీకి మోడలింగ్ అంటే ఇష్టం. అలా 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత యాంకర్‌గా మారిన ఆమె హిందీ సినిమా మస్తీజాదే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించింది.
2022లో రుద్రవీణ సినిమాతో హీరోయిన్‌గా మారింది. డెవిల్ మూవీతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అమిగోస్, కథ వెనుక కథ.. ఇలా పలు చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. తనకు తెలుగు రాదు, కానీ తెలివి మాత్రం చాలా ఉందంటోంది శుభశ్రీ. మరి ఆ తెలివిని రానున్న రోజుల్లో ఎలా ఉపయోగిస్తుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment