
'ముద్దమందారం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇదే తనకు తొలి సీరియల్. తను ఇండస్ట్రీలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. కూతుర్ని టీచర్‌ను చేయాలనుకుంటే తనూజ మాత్రం నటనవైపు అడుగులు వేసింది. కాలేజీలో చదువుతున్న సమయంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా సినిమా చేసింది.
మూడేళ్లు మాటల్లేవ్
దాంతో ఆమె తండ్రి మూడేండ్లు నటితో మాట్లాడలేదు. ఈ సినిమా రిలీజయ్యాక తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ముద్ద మందారం సీరియల్‌లో ఆఫర్ వచ్చింది. ఈ ధారావాహికతోనే తన దశ తిరిగిపోయింది. తాజాగా ఆమె తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్నకు యాక్టింగ్ అస్సలు ఇష్టం లేదు. అయినా హైదరాబాద్‌కు వచ్చి యాక్టింగ్ ద్వారా పేరు సంపాదించుకున్నాను.
తప్పకుండా శిక్షిస్తారు
అప్పుడు వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ, ఇప్పుడు బిగ్‌బాస్‌కు వెళ్తున్నా అని కూడా నాన్నకు తెలియదు. ఆయన తప్పకుండా నన్ను శిక్షిస్తారు. నాతో మాట్లాడరు.. నాన్నకు తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో నాగ్.. ఆడపిల్లను మా ఇంటిబిడ్డలా చూసుకుంటాము. ఇండస్ట్రీ గురించి ఎటువంటి భయం అవసరం లేదు అని అభయమిచ్చాడు.