హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్‌​ కంటెస్టెంట్‌ | Bigg Boss Contestant Balaji Murugadoss Debut Movie Va Varalam Va | Sakshi
Sakshi News home page

Balaji Murugadoss: హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్‌​ కంటెస్టెంట్‌, హీరోయిన్‌ ఎవరంటే?

Published Wed, Sep 13 2023 12:43 PM | Last Updated on Wed, Sep 13 2023 1:05 PM

Bigg Boss Contestant Balaji Murugadoss Debut Movie Va Varalam Va - Sakshi

బిగ్‌బాస్‌ ఫేమ్‌ బాలాజీ మురుగదాస్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'వా వరలామ్‌ వా'. ఎస్‌జీఎస్‌ క్రియేటివ్‌ మీడియా పథకంపై ఎల్జీ రవిచందర్‌, ఎస్‌పీఆర్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. రెడిన్‌ కింగ్స్‌ లీ కామెడీ పాత్రలో నటిస్తుండగా మహానా సంజీవి హీరోయిన్‌గా, మైమ్‌ గోపీ విలన్‌గా నటిస్తున్నారు. నటుడు సింగం పులి, శరవణసుబ్బయ్య, దీప, గాయత్రి రమా, పయిల్‌ వాన్‌ రంగనాథన్‌, బొండామణి, మీసైరాజేంద్రన్‌, క్రేన్‌ మనోహర్‌, ప్రభాకరన్‌, యోగి సామి, రామసామి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

వీరితో పాటు 40 మంది బాలలు నటించడం విశేషం. దర్శక ద్వయం ఎల్జీ రవిచంద్రన్‌, ఎస్‌పీఆర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని, కార్తీక్‌ రాజా చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఈచిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం చైన్నెలో జరిగింది. చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సంగీత దర్శకుడు దేవా ఆవిష్కరించి యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. కాగా చిత్ర టైటిల్‌కు, పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల్లో మంచి స్పందన వస్తోందని చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు.

చదవండి: అనారోగ్యంతో ఆస్తి అమ్మేయాలనుకున్న నటి.. తనను, కూతుర్ని చంపుతామని బెదిరింపులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement