Bigg Boss Fame Ashu Reddy Shares Netizen Phone Number in Her Instagram - Sakshi
Sakshi News home page

Ashu Reddy: ఫోన్‌ నెంబర్‌ షేర్‌ చేసిన అషు రెడ్డి, దండం పెడుతూ వేడుకున్న నెటిజన్‌

Published Mon, Feb 7 2022 4:02 PM | Last Updated on Mon, Feb 7 2022 7:38 PM

Bigg Boss Fame Ashu Reddy Shares Netizen Phone Number Goes Viral - Sakshi

అషు రెడ్డి.. సోషల్‌ మీడియా యూజర్లకు, బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌ అనంతరం స్టార్‌గా ఎదిగిన అషు, ఆ తర్వాత హాట్‌హాట్‌గా ఫొటోషూట్‌లకు ఫోజులు ఇచ్చి.. వాటిని షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. అంతేకాదు బోల్డ్‌ కంటెంట్‌పై వీడియో చేసి తన యూట్యూబ్‌ చానల్‌లో షేర్‌ చేస్తూ తరచూ ట్రోల్స్‌ బారిన పడుతోంది. ఇక ఫేం కోసం ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్‌ ఇంటర్య్వూ ఎంతగా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చదవండి: రూ. 200 కోట్ల పైగా లతా ఆస్తులు ఎవరికి? వీలునామాలో ఏం ఉంది..

అప్పటి నుంచి అషు రెడ్డిని బోల్డ్‌ బ్యూటీ అని కూడా పిలుస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా అషు మరోసారి సోషల్‌ మీడియాలో తన ప్రతాపం చూపించింది. ఈసారి ఏకంగా ఫోన్‌ నెంబర్‌ షేర్‌ చేసి ఓ నెటిజన్‌కు చుక్కలు చూపించింది. అసలేం జరింగిందంటే.. తాజాగా సోషల్‌ మీడియాలో లైవ్‌చాట్‌ నిర్వహించిన అషు ఫ్యాన్స్‌ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. లైవ్‌లోకి వచ్చిన సెలబ్రెటీలను సాధారణంగా నెటిజన్లు వారి ఫోన్‌ నెంబర్‌ అడిగి ఇబ్బంది పెడుతుంటారు.

చదవండి: విడాకుల దిశగా శిల్పా శెట్టి-రాజ్‌కుంద్రా!, అందుకేనా ఆస్తుల పంపకాలు?

కానీ ఇక్కడ ఓ నెటిజన్‌ తెలివిగా ప్రవర్తించాడు. అషు నెంబర్‌ అడగాడికి బదులుగా.. తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు. అంతేకాదు నీతో మాట్లాడాలని ఉంది అక్క.. ఫోన్‌ చేయ్‌ అని చెప్పాడు. ఇక ఈ ఫోటోలను అషు తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. దీంతో ఈ పోస్ట్‌లో నెంబర్‌ చూసిన ఆమె ఫ్యాన్స్‌ ఆ నెంబర్‌కి కాల్‌ చేస్తున్నారట. దీంతో ఆ నెటిజన్‌ ప్లీజ్‌ అక్క దెబ్బకు దిగివచ్చిన నెటిజన్.. ఆ పోస్ట్ డెలిట్ చేయ్ అక్కా అంటూ దండం పెట్టి మరీ వేడుకున్నాడు. ఇందుకు అషూ ఎంజాయ్ చేయ్ అంటూ కూల్ రిప్లై ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement