BB Telugu 2 Winner Kaushal Manda About His Movie Offers in Latest Interview - Sakshi
Sakshi News home page

Bigg Boss Kaushal: ఆ సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది, అందరిలా నేను అలా అడుక్కొను

Published Fri, Feb 11 2022 8:06 PM | Last Updated on Fri, Feb 11 2022 8:55 PM

Bigg Boss Fame Kaushal Manda About His Movie Offers In Latest Interview - Sakshi

టీవీ నటుడు, మోడల్‌ కౌశల్‌ బిగ్‌బాస్‌ షోతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ ఎపిసోడ్‌తో కౌశల్‌ దశ తిరిగిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఫలితంగా బిగ్‌బాస్‌ సీజన్‌-2 విన్నర్‌గా టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ అవకాశాల విషయంలో పెద్ద మార్పు కనిపించలేదు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా సినిమా అవకాశాలపై మాట్లాడుతూ.. కొన్ని కథలు నచ్చకపోవడం వల్ల వదులుకున్నానని, మరికొన్ని రెమ్యునరేషన్‌ డిమాండ్‌ పరంగా ఆఫర్లు రావడం లేదన్నాడు. 

చదవండి: ‘ఖిలాడి’ మూవీ రివ్యూ

‘నేను 86 సినిమాల్లో నటించాను. కానీ అవి నాకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీనికి కారణంగా సినిమాలపై నేను పెద్దగా ఆసక్తి చూపకపోవడం. సినిమా చాన్స్‌ కావాలంటూ నేనేప్పుడు దర్శక-నిర్మాతలను అడగలేదు. వాళ్లే ఫోన్‌ చేసి అవకాశం ఉందని చెప్తే చేశాను. కొంతమంది అవకాశాలు కావాలంటూ వాళ్ల వద్దకు తరచూ వెళ్లి అడుక్కుంటారు. కానీ నా స్టైల్‌ అది కాదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే నా స్టైల్‌, టాలెంట్‌ చూసి ఆఫర్లు వస్తే చేస్తాను కానీ,  ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కొను. పైగా నేను చాలా బిజీ, సొంతంగా నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది. ప్రతిరోజు షూట్స్‌, ఫ్యాషన్ షోస్, యాడ్స్ జరుగుతుంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: కాజల్‌ బాడీపై ట్రోల్స్‌.. స్పందించిన సమంత, లక్ష్మి మంచు

ఇక ఓ సినిమా తన కెరీర్‌ను నాశనం చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కౌశల్‌. ‘మా అమ్మకి క్యాన్సర్ బాధపడుతున్న సమయంలో డబ్బు అవసరం చాలా వచ్చింది. అప్పుడు మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. హాస్పటల్‌లో డబ్బులు కట్టడం కోసమే అప్పట్లో నేను ఒక సినిమాకి కమిట్ అయ్యాను. ఆ మూవీకి నా రెమ్యునరేషన్‌ రూ.50 వేలు ఇచ్చారు. కానీ ఆ సినిమా వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది. సమాజానికి ఒక సందేశంగా ఉంటుందని ఆ సినిమా చేశా. కానీ అది అడల్ట్ మూవీ కావడంతో.. కౌశల్ అడల్ట్ మూవీస్ చేస్తాడనే ముద్ర పడింది’ అన్నాడు.

చదవండి: 60వ పుట్టిన రోజు: కీలక ప్రకటన ఇచ్చిన జగపతి బాబు

అదే సమయంలో ఎయిడ్స్‌ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండేది. దానిపై అవగాహనలో భాగంగా ఈ సినిమా తీశాం. కానీ అందులోని నా పాత్ర నెగిటివ్‌ ఇంప్రెషన్‌ పడింది. ఆ విమర్శలు, ట్రోలింగ్‌ నుంచి బయటపడేందుకు చాలా టైం పట్టింది. ఆ తర్వాత చక్రవాకం సీరియల్ చేశాక నాపై ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోయింది’ అన్నాడు. కౌశల్‌కు అంతగా చేదు అనభవాన్ని ఇచ్చిన ఆ అడల్ట్‌ మూవీపై పేరు స్వర్ణ. ఈ సినిమాలో రమ్య శ్రీ హీరోయిన్ కాగా.. షకీలా, రేష్మ ఇతర పాత్రల్లో నటించారు. రమ్య శ్రీ ఇంట్లో పనోడిగా చేరిన కౌశల్.. కోరిక తీర్చమంటూ ఆమె వెంటపడే నెగిటివ్‌ రోల్‌ చేశాడు. చివరికి ఈ సినిమాలో కౌశల్‌ కట్టుకున్న భార్య చేతిలో చనిపోతాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement