
‘‘రైట్’ చిత్రం ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ బాగుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బు తీసుకురావాలి’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. ‘బిగ్‌బాస్ 2’ విన్నర్ కౌశల్ మండ, లీషా ఎక్లైర్స్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రైట్’. మహంకాళి దివాకర్, లుకలాపు మధు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ మోషన్ పోస్టర్‌ను వెంకటేశ్ విడుదల చేశారు.
కౌశల్ మాట్లాడుతూ–‘‘మలయాళ చిత్రం ‘మెమోరీస్’కు తెలుగు రీమేక్ ‘రైట్’. ‘బిగ్‌బాస్’ షోలో నన్ను ఆదరించినట్లే మా సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘రైట్’ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: విజయ్ కూరాకుల
Comments
Please login to add a commentAdd a comment