Bigg Boss Fame Shiva Jyothi Shares Home Tour Video - Sakshi
Sakshi News home page

Shiva Jyothi Home Tour: అప్పు తీసుకుని మరీ గృహప్రవేశం, అలా అవడంతో డిప్రెషన్‌.. హోంటూర్‌ చేస్తూ ఏడ్చేసిన యాంకర్‌

Published Wed, Aug 2 2023 10:59 AM | Last Updated on Wed, Aug 2 2023 11:41 AM

Bigg Boss Fame Shiva Jyothi Shares Home Tour Video - Sakshi

తెలంగాణ యాసతో గలగలా మాట్లాడే యాంకర్‌ శివజ్యోతి. తన మాటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ఆ మధ్య బిగ్‌బాస్‌ షోలోనూ అడుగుపెట్టి సందడి చేసింది. ఏదున్నా ముఖం మీదే మాట్లాడే శివజ్యోతి.. జ్యోతక్క యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె యూట్యూబ్‌లో హోం టూర్‌ వీడియో చేసింది. 

'మణికొండలో మేము తీసుకున్న మొదటి ఇల్లు ఇది. 2019లో కొనుక్కున్నాం. 2020 ఫిబ్రవరిలో గృహప్రవేశం చేశాం. నెల రోజులకే లాక్‌డౌన్‌ వచ్చింది.  కొద్ది రోజుల కిందటే ఇక్కడికి షిఫ్ట్‌ అయ్యాం' అంటూ తన ఇంటినంతా కలియ తిరిగి చూపించింది. తనకు వచ్చిన అవార్డులు, అవి ఎప్పుడు, ఎక్కడ వచ్చాయనేది చెప్పుకొచ్చింది. హాల్‌, 3 బెడ్‌రూమ్స్‌, డ్రెస్సింగ్‌ ఏరియా, వార్డ్‌ రోబ్స్‌ ఇలా అన్నింటిని ప్రత్యేకంగా తనకు నచ్చిన ఇంటీరియర్‌తో దగ్గరుండి డిజైన్‌ చేయించుకున్నట్లు తెలిపింది. అయితే చివర్లో మాత్రం ఈ ఇంట్లో ఉండటం లేదని ట్విస్ట్‌ ఇచ్చింది.

'లాక్‌డౌన్‌ రావడంతో ఒకరి దగ్గర రూ.2 లక్షలు అప్పు తీసుకుని మరీ ఈ ఇంట్లోకి వచ్చాను. ఈఎమ్‌ఐలు ఎలా కట్టాలో అని చాలా టెన్షన్‌ పడ్డాను. ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను. ఈ ఇంటితో ఎన్నో ఎమోషన్స్‌ ముడిపడి ఉన్నాయి. ఎంతో లక్‌ అనుకున్న ఈ ఇంటిని ఎప్పటికీ తీసేయొద్దని భావించాను. కొత్త న్యూస్‌ ఛానల్‌ కూడా ప్రారంభించాను. కానీ అది వర్కవుట్‌ కాలేదు. దానికి వ్యూస్‌ రాకపోవడంతో బాధపడ్డాను, డిప్రెషన్‌కు లోనయ్యాను.

ఈ ఇల్లు నాకన్నీ ఇచ్చింది కాబట్టి ఛానల్‌ కూడా హిట్టవుతుందనుకున్నాను. కానీ అది జరగలేదు. ఇప్పుడిక ఈ ఇల్లు నాది కాదు, అమ్మేద్దామనుకుంటున్నాను. ఇప్పటికే కొత్త ఇల్లు కొనుక్కున్నాను. రెండు ఇళ్ల ఈఎమ్‌ఐలు కట్టడం కష్టమవుతుంది కాబట్టి దీన్ని అమ్మేద్దామని ఆలోచిస్తున్నాను. నన్ను ఊరికనే తిట్టకండి. అది చాలా ఎఫెక్ట్‌ అవుతుంది' అని కంటతడి పెట్టుకుంది శివజ్యోతి.

చదవండి: కోలీవుడ్‌ ఎంట్రీకి బాలీవుడ్‌ హీరోయిన్‌ రెడీ! అలాంటి రోల్‌ చేయాలనుందట
దసరాకి టైగర్‌ వేట కన్ఫర్మ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement