బుల్లితెరపై బిగ్‌బాస్ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్ మొదలైందంటే చాలు అభిమానులకు రోజు పండగే. ఇక తెలుగులో ఈ షో సీజన్ సీజన్‌కు ప్రేక్షక ఆదరణ పెరుగుతోంది. గతేడాది ప్రసారమైన తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. లాక్‌డౌన్‌లో సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఈ షో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ఆ సీజన్‌లో ఎక్కువగా కొత్త ముఖాలే ఉన్నప్పటికీ నాగార్జున తన అనుభవంతో షో ఆసక్తిగా మలచడంతో సీజన్ 4 విజయవంతంగా ముగిసింది.
దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఐదో సీజన్‌పై దృష్టి పెట్టారు. నాల్గో సీజన్ ముగిసి నెల రోజులకే స్టార్ మా ఐదో సీజన్ కోసం పనులు ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్‌లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన రావడంతో త్వరలోనే బిగ్‌బాస్ 5 సీజన్‌ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఈ షోకు పలువురు నటీనటులను సంప్రదించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌పై ప్రారంభంపై కొద్ది రోజులు పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా ఇప్పట్లో ఈ షో ప్రారంభమయ్యే అవకాశమే లేనట్లు వార్తలు వినిపించాయి.
తాజా సమాచారం ప్రకారం అగష్టులో బిగ్‌బాస్ 5ని ప్రారంభించాలని నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారట. గతేడాది మాదిరిగానే కంటెస్టెంట్స్‌ను ముందుగా క్వారంటైన్ ఉంచనున్నారని సమాచారం. అంతేగాక కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూరైందనట్లు కూడా సమాచారం. ఆగష్టు నాటికి కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని బిగ్ బాస్ నిర్వాహకులు భావించి షోను ప్రారంభించాలని నిర్ణయించినట్లు వినికిడి. ఇక సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాకు సంబంధించి కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తుండగా తుది జాబితాలో ఆ కంటెస్టెంట్లే ఉంటారో లేదో తెలియాల్సి ఉంది. గత రెండు సీజన్లు కింగ్ నాగార్జున వల్లే హిట్టైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment