Bigg Boss Telugu 6: Chalaki Chanti Agrees That He Is Flop - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: అవును, నేను ఫ్లాప్‌.. నాగ్‌ ముందు నిజం ఒప్పేసుకున్న చంటి

Published Sat, Oct 8 2022 7:24 PM | Last Updated on Sat, Oct 8 2022 7:38 PM

Bigg Boss Telugu 6: Chalaki Chanti Agrees That He Is Flop - Sakshi

ఈ వారం కంటెస్టెంట్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం దేవుడెరుగు కానీ, బిగ్‌బాసే హౌస్‌మేట్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇప్పుడాపనిని నాగార్జున తలకెత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఇంటిసభ్యుల మీద ఫైర్‌ కాకుండా వారితో సరదాగా సంభాషించాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో నాగ్‌ హౌస్‌మేట్స్‌తో హిట్‌ అండ్‌ ఫ్లాప్‌ గేమ్‌ ఆడించాడు. అందులో భాగంగా రెండు బోన్లలో ఒక్కో కంటెస్టెంట్‌ నిలబడి ఎవరు హిట్‌, ఎవరు ఫ్లాప్‌ అనేది నిర్ణయించుకోవాలి. ఈ క్రమంలో నాగ్‌ అందరిపై అవాక్కులు చవాక్కులు పేల్చాడు. అయితే గీతూ మాత్రం ఆదిరెడ్డి కంటే తానే ఎక్కువ ఎంటర్‌టైన్‌ ఎక్కువ చేస్తానని, కాబట్టి తాను హిట్‌, అతడు ఫ్లాప్‌ అని తేల్చేసింది.

అందరి గురించి తెలుసుకోవడమే కాక అందరితో కలుపుకుపోతున్న తనే హిట్‌ అని చెప్పింది సుదీప. కనీసం ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయని చంటి ఫ్లాప్‌ అని పేర్కొంది. దీన్ని చంటి ఆమె మాటను వ్యతిరేకించకపోగా, తాను నిజంగానే ఫ్లాప్‌ అని ఒప్పేసుకున్నాడు. మరి ఎవరు హిట్‌ లిస్ట్‌లో, ఎవరు ఫ్లాప్‌ లిస్ట్‌లో ఉన్నారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: ఆ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌!
నటికి చేదు అనుభవం, షోరూమ్‌లో లాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement