
కొన్ని టాస్కులు, ఛాలెంజ్‌లు ప్రతి సీజన్‌లోనూ కొనసాగుతూ ఉంటాయి. అలాంటిదే హెయిర్ కట్ చాలెంజ్. పొడవాటి హెయిర్‌ను చిన్నగా చేస్తామంటారు.. గడ్డం, మీసం తేసేయాలంటారు. అందుకు ఒప్పుకుంటే ఏదో ఒక బెనిఫిట్ ఇస్తామంటారు.

ఛాలెంజ్ తిరస్కరించిన పృథ్వీ
ఈ సీజన్‌లో అవినాష్, పృథ్వీలకు ఇలాంటి ఛాలెంజ్ ఎదురైంది. హెయిర్ కట్‌తో పాటు గడ్డం తీసేయాలన్నారు. ఇందుకుగానూ ప్రైజ్‌మనీలో రూ.50 వేలు యాడ్ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఎంత డబ్బిచ్చినా సరే, తనను బయటకు పంపించినా సరే గడ్డం తీసేదే లేదని పృథ్వీ నో చెప్పాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో పృథ్వీని దీని గురించే అడిగాడు నాగ్.

నాగ్ బంపరాఫర్
పృథ్వీ గడ్డం తీసేస్తే ఏకంగా రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. అందుకు పృథ్వీ ఒప్పుకోలేదు. దీంతో మూడువారాలపాటు నామినేషన్స్‌లో లేకుండా ఇమ్యూనిటీ ఇస్తానన్నాడు. దానివల్ల నేరుగా 10వ వారంలోకి అడుగుపెట్టొచ్చన్నాడు. ఇంత మంచి బంపర్ ఆఫర్ ఇచ్చినా సరే పృథ్వీ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
బుద్ధి ఏమైపోయింది?
ఇకపోతే నిఖిల్, గౌతమ్.. ఆటలో హద్దులు మీరి కొట్టుకున్నట్లుగా ఉందని వీడియో వేసి మరీ క్లాస్ పీకాడు. ఇక్కడ మీ బుద్ధి ఏమైందని ప్రశ్నించడంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు. మరి నాగ్ చేతిలో ఎవరికి ఎక్కువ అక్షింతలు పడ్డాయో తెలియాలంటే మరికాసేపట్లో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment