
మెగా చీఫ్ పోస్ట్ కోసం పోటీపడాలంటే ముందు కంటెండర్లు కావాలి. కంటెండర్లు కావాలన్నా, ఆల్‌రెడీ కంటెండర్లుగా ఉన్నవారు మరో అడుగు ముందుకు వేయాలన్నా గేమ్ ఆడి గెలవాల్సి ఉంటుందన్నాడు. ఈ క్రమంలో హౌస్‌లో పలు టాస్కులు జరుగుతున్నాయి. నేటి ప్రోమోలో కీని పట్టు కంటెండర్‌షిప్ గెలిచేట్టు అనే గేమ్ ఇచ్చాడు.

ప్లాన్ చేసి మరీ..
ఇందులో మొదట విష్ణుప్రియ చురుకుగా ఆడింది. కానీ చివర్లో పృథ్వీ సరైన కీ వెతికి పట్టుకోవడంతో ఆమె కన్నా ముందుగా బాక్సులు తెరిచి విజయం సాధించాడు. ఇంతలో తేజ.. వాంటెడ్‌గా ప్లాన్ చేసి మరీ నిన్ను ఓడించారంటూ విష్ణుకు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అయితే ఓడిపోయినా విష్ణుకు మేలే జరిగింది.
విష్ణుకు ఛాన్స్ ఇచ్చిన పృథ్వీ
ఒకర్ని కంటెండర్ చేసే ఛాన్స్ పృథ్వీకి రాగా అతడు ఆ అవకాశాన్ని విష్ణుప్రియకే ఇవ్వడం విశేషం. ఆ కంటెండర్‌షిప్‌ను కాపాడుకోవాలంటే మరో ఆట ఆడి గెలవాల్సి ఉంటుంది. మరి ఎవరెవరు చీఫ్ కంటెండర్లయ్యారు? ఫైనల్‌గా చీఫ్ పోస్టును ఎవరు అధిరోహించారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment