
తెలుగు బుల్లితెర యాంకర్‌గా విష్ణుప్రియ పేరు అందరికీ సుపరిచితమే! పోవే పోరా కార్యక్రమంతో యాంకర్‌గా అలరించిన ఈ బ్యూటీ కామెడీ స్కిట్స్‌లోనూ పాల్గొంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ మానస్‌తో కలిసి చేసిన జరీజరీ చీర కట్టి సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. జేడీ చక్రవర్తి తన ఫస్ట్ క్రష్ అని, తనతో పెళ్లికి రెడీ అంటూ అప్పట్లో నానా హంగామా చేసింది.
కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్ ముఖమే చూడనన్న ఈ బ్యూటీ ఏకంగా హౌస్‌లోనే ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లలో ఈవిడే జనాలకు కాస్త ఎక్కువ పరిచయమున్న ఫేస్. అందచందాలతో అల్లాడించే ఈ యాంకర్ పృథ్వీ అనే కంటెస్టెంట్ వెనకాల పడి ఆటపై ఫోకస్ పెట్టడం మర్చిపోయింది. దాంతో ఫైనల్స్‌లో ఉండాల్సిన ఆమె పద్నాలుగోవారంలో ఎలిమినేట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment