ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి యాంకర్‌ రష్మీ? భారీగా పారితోషికం..! | Is Bigg Boss Telugu Team Approach Anchor Rashmi For 7th Season | Sakshi
Sakshi News home page

Anchor Rashmi Gautam: బిగ్‌బాస్‌లోకి యాంకర్‌ రష్మీ? కొన్ని షరతులతో నటి డిమాండ్‌!

Published Thu, Feb 9 2023 9:12 PM | Last Updated on Thu, Feb 9 2023 9:20 PM

Is Bigg Boss Telugu Team Approach Anchor Rashmi For 7th Season - Sakshi

బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగు 6 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 7వ సీజన్‌కు ముస్తాబవుతోంది. దీంతో బిగ్‌బాస్‌ నిర్వహకులు కంటెస్టెంట్స్‌ వేటలో పడ్డారు. అయితే ప్రతి సీజన్‌ టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకుపోయిన బిగ్‌బాస్‌.. 6వ సీజన్‌ మాత్రం బోల్తా పడిన సంగతి తెలిసిందే. గత సీజన్‌ కంటెస్టెంట్స్‌ పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవడంతో ఆదరణ పొందలేదు. అంతేకాదు వారు హౌజ్‌లో పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించలేదనేది కూడా టాక్‌.

చదవండి: సరిగమప విన్నర్‌ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ

దీంతో గత సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్‌ 6వ సీజన్‌ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఈ సారి ఆ తప్పు జరగకుండ నిర్వహకులు జాగ్రత్తగా కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్‌ చేస్తున్నారట. ఇందుకుకోసం ఫేం ఉన్న నటీనటులను హౌజ్‌లో దింపేస్తుందుకు ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ 7వ సీజన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఈ సీజన్‌ కంటెస్టెంట్‌గా హాట్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ను బిగ్‌బాస్‌ టీం సంప్రదించిందని సమాచారం. ఆమెతో చర్చించగా తను భారీగా పారితోషికం డిమాండ్‌ చేసినట్లు ఫిలిం సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. తప్పు చేశానంటూ స్టేజ్‌పై సిరి కన్నీళ్లు!

ఒక్కో వారానికి తనకు రూ. 7 నుంచి రూ. 8 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో నిర్వహకులు అవాక్కయ్యారట. అంతేకాదు తాను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి రావడానికి కొన్ని కండిషన్స్‌ కూడా పెట్టిందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే రష్మీ కానీ, బిగ్‌బాస్‌ టీం కానీ స్పందించేవరకు వేచి చూడాలి. కాగా బుల్లితెరపై యాంకర్‌ రష్మీకి మంచి క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త వైరల్‌ కావడంతో రష్మీతో పాటు సుధీర్‌ అన్న కూడా ఉంటే బాగుంటుందంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement