
ఇప్పటి హీరోలు అభద్రతా భావం ఉంటున్నారంటూ బాలీవుడు నటుడు సునీల్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన నటించి లేటెస్ట్ వెబ్‌సిరీస్ ధరవి బ్యాంక్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌ల్లో భాగంగా ఇటీవల ఆయన బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందకపోవడానికి కారణమేంటనే ప్రశ్న ఎదురైంది.
చదవండి: అవన్ని పుకార్లే.. మీరే చూడండి అలా ఉన్నానా?: హీరోయిన్
దీనికి ఆయన స్పందిస్తూ ప్రస్తుత హీరోల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి హీరోలకు అభద్రత భావం ఎక్కువైంది. ప్రస్తుతం కెరీర్ ఎంత కాలం ఉంటుందనేది గ్యారంటీ లేదు. అందుకే ఎంత సంపాదించాలా? అని చూస్తున్నారే తప్ప చేసే సినిమా మీద దృష్టి పెట్టడం లేదు. వాళ్లకు డబ్బు తప్ప మరో ధ్యాస లేదు’ అని విమర్శించాడు. అదే విధంగా ‘తరచూ ప్రేక్షకులను కలుస్తుంటేనే మన లోపాలేంటనేవి తెలుస్తుంటాయి.
చదవండి: వైష్ణవిని పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్ నెగిటివిటీ: దర్శకుడు
వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనేది అవగాహన వస్తుంది. ఇప్పటి హీరోలు ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ అయితే తప్ప బయటకు రావడం లేదు. తమ అభిమన హీరో తరుచూ ఏ రెస్టారెంట్‌కు వెళ్లాడు, ఏ కారు కొన్నాడు అనే విషయాల్ని ప్రేక్షకులు పట్టించుకునే రోజులు పోయాయి. రీల్ హీరోగా కాకుండా రియల్ హీరో అనిపించే వారినే ఇప్పుడు వారు అభిమానిస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక ఒకప్పుడు బాలీవుడ్‌లో మల్టీస్టారర్స్ చాలా ఎక్కువగా వచ్చేవని, కానీ ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి నటించడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారని సునీల్ శెట్టి వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment