
ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను(63) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా గురువారం రాత్రి వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తు సనుడా కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దయచేసి నా ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థించండి. థ్యాంక్యూ మై టీమ్’ అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ నెల 20న సాను పుట్టినరోజు. దీంతో లాస్ ఏంజెల్స్‌లో కుటుంబంతో సరదాగా బర్త్‌డే పార్టీ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అక్టోబర్ 14న అక్కడకు వెళ్లాలని అనుకున్నారు.కానీ ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేనందున నవంబర్‌కు వాయిదా వేసుకున్నారు, సనూకు భార్య సలోని, కూతుళ్లు షానూన్, అన్నాబెల్ ఉన్నారు. చదవండి: మీ ప్రేమను తిరిగి ఇస్తా!
ఇక కుమార్ సాను 1990లో బాలీవుడ్‌లో అద్భుత పాటలను అలపించారు. బీబీసీ టాప్ 40 బాలీవుడ్ సౌండ్‌ట్రాక్స్‌లో కుమార్ పాటలు దాదాపు 25 ఉన్నాయి. అతను 30 భాషల్లో 21 వేల పాటలను పాడి రికార్డు సృష్టించారు. అంతేగాక కేవలం ఒకే రోజులో 28 పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. ప్రస్తుతం కుమార్ సాను కుమారుడు జాన్ బిగ్‌బాస్ 14లో కంటెస్టెంటుగా ఉన్నారు. 2009లో పద్మ శ్రీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment