'కన్నప్ప' కోసం స్టార్‌ హీరోను దింపిన మంచు విష్ణు.. అధికారిక ప్రకటన | Bollywood Star To Enter In Kannappa Movie | Sakshi
Sakshi News home page

'కన్నప్ప' కోసం స్టార్‌ హీరోను దింపిన మంచు విష్ణు.. అధికారిక ప్రకటన

Apr 16 2024 9:09 AM | Updated on Apr 16 2024 9:30 AM

Bollywood Star Enter In Kannappa Movie - Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు 'కన్నప్ప' కోసం భారత దిగ్గజ నటలను దింపుతున్నాడు. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కోసం ఖర్చు ఎంతైనా పర్వాలేదంటూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో వివిధ సినిమా ఇండస్ట్రీల స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశాడు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో ఆయన పంచుకున్నాడు.

మోహ‌న్ బాబు నిర్మాణంలో వ‌స్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా  రేంజ్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. 'కన్నప్ప' పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా.. ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే  ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార, మధుబాల వంటి స్టార్ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ రాకతో ఈ పాన్ ఇండియా మూవీ మంచి బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చినట్లయింది. కన్నప్ప సినిమాతో అక్షయ్ కుమార్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు.

1993లో ఓ కన్నడ సినిమాలో కనిపించిన అక్షయ్‌ ఆ తర్వాత 2018లో రజినీకాంత్‌ రోబో2.0 సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్‌ని లాక్ చేశారని వార్తలు వస్తున్నాయి.  ఓ మై గాడ్ 2లో ఇలాంటి పాత్రలో కనిపించిన అక్షయ్‌ భేష్ అనిపించుకున్నాడు. దీంతో కన్నప్పకు బాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ వస్తుందని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.  ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే కల్కి సినిమాలో  శ్రీవిష్ణువు అంశతో కూడిన భైరవగా ప్రభాస్‌ కనిపించనున్నాడు.. ఇలాంటి సమయంలో కన్నప్పలో మహాశివుడిగా కనిపిస్తే ఇబ్బందవుతుందని భావించిన ప్రభాస్‌.. మంచు విష్ణును రిక్వెస్ట్‌ చేసి మార్పులు చేయాలని కోరాడట. దీంతో శివుడి పాత్ర కోసం వేట కొనసాగించిన మంచు విష్ణుకు అక్షయ్‌ కుమార్‌ అయితే బాగుంటుందని ప్లాన్‌ చేశాడట. అలా టాలీవుడ్‌లోకి తాజాగా అక్షయ్‌ ఎంట్రీ ఇచ్చేశాడు. త్వరలో షూటింగ్‌ జరుగుతుందని విష్ణు ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement