దక్షణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పుకోకుండా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి అంగీకరిస్తుంది. అందుకే ఈమె చేసింది తక్కువ చిత్రాలే అయినా పేరు మాత్రం బాగానే సంపాందించుకుంది. ఇంకా చెప్పాలంటే ఇటీవల ఈమె తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య తెలుగులో చిరంజీవికి చెల్లెలిగా భోళా శంకర్ చిత్రంలో నటించే అవకాశం వస్తే సున్నితంగానే తిరస్కరించింది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో ఆమె నటించకపోవడమే మంచిదైందని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కారణం.. భోళాశంకర్ డిజాస్టర్ అయ్యింది.
ప్రస్తుతం తమిళంలో నటుడు కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో శివకార్తీకేయన్‌కు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే కశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో మరో చిత్రం లేదు. తాజాగా ఈమె సీతావతారం ఎత్తనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా కాలం క్రితం శ్రీరామరాజ్యం చిత్రంలో నయనతార సీతగా నటించి ప్రశంసలు అందుకుంది. ఇటీవల ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో హీరోయిన్ కృతీసనన్ సీతగా నటించింది. అయితే ఆమె ఆ పాత్రలో మెప్పించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. చిత్రం కూడా ఘోరంగా దెబ్బతింది.
మరోసారి రామాయణాన్ని అదే పేరుతో భారీ ఎత్తున తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితీష్ తివారి ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించనున్నారు. ఇందులో నటుడు రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించనున్నారు. ఈ చిత్రంలో సీతగా నటి ఆలియా భట్ నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ చిత్రం నుంచి ఆమె వైదొలిగారని, దీంతో ఆ పాత్రలో సాయిపల్లవిని నటింపేజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ఈ చిత్రం ద్వారా సాయిపల్లవి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతుందన్న మాట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఎదురు చూద్దాం.
చదవండి: సినిమాకేమో మిశ్రమ స్పందన.. కలెక్షన్లు చూస్తే షాకవ్వాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment